ఎల్లకొండలో నీళ్ల వెతలు

  • మరమ్మతులకు నోచని చేతిపంపులు
  • కన్పించని ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ
  • పట్టించుకోని అధికారులు

మూడు నెలల నుంచి నవాబ్‌పేట మండలంలోని ఎల్లకొండ గ్రామస్తులను తాగు నీటి వెత వెంటాడుతోంది. గ్రామంలో మొత్తం బోర్లూ మరమ్మతుకు నోచలేదు. నీరందించాలని మహిళలతో సహా అధికారులకు, ప్రత్యేక అధికారులకు ఎన్నోమార్లు విన్నవించారు కానీ స్పందించలేదు. పొద్దు పొడవక ముందే బెందెడు నీటికోసం మహిళలు కన్నకష్టాలు పడుతున్నారు. పొలాల్లోని బోర్లదగ్గరికి వెళ్ళి నీరు తెచ్చుకుంటున్నారు. కరెంటు లేకపోతే గంటల తరబడి నిరీక్షించాల్సిందే! యాటా వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం ఊరంతా తల్లడిల్లుతోందంటే అధికారులు ఏం చేస్తున్నట్లు? ఏడాదికేడాదికీ జల ఎద్దడని తీవ్రమవుతోందంటే అధికరుల వైఫల్యమే కారణం. నీటి కోసం ఖర్చు చేస్తున్న నిధులు ఏమైనట్టు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తమకు కనీసం ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయండని మొత్తుకుంటున్నా సంబంధిత అధిరుల్లో చలనం లేకపోవడం విడ్డూరంపై, ఎల్లకొండ నీటి వెతలపై ప్రజాశక్తి ప్రత్యేక కథనం...

ఎల్లకొండలో మూడు నెలల నుంచి మంచి నీటి ఎద్దడి గ్రామస్తుల ను పీడిస్తోంది. చేతిపంపులన్నీ చెడిపో యాయి. పనిచేస్తున్న ఒక్కబోరు నుంచి చుక్క నీరూ రావడం లేదు. నీటి అవస్థలు తట్టుకోలేక గ్రామస్తులు పలు మార్లు అధికారులకు వివరించారు. తమకు తాగునీటిని అందించడి మహాప్రభో అని వేడుకున్నారు. నీటి సమస్య అధికంగా ఉందని దానిని పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులకు, గ్రామ ప్రత్యేకాధికారికి మొరపెట్టుకున్నారు. అయినా ఎవరూ స్పందించడం లేదని పుష్పమ్మ, ఎల్లమ్మ, స్వరూప, శోభ, యాదమ్మ, పద్మ, కిష్టయ్య, మల్లేశం, నర్సింహులు గ్రామాన్ని సందర్శించిన ప్రజాశక్తితో తెలిపారు. రోజూ మంచినీటిని పొలాల వద్ద ఉన్న బోరుబావుల దగ్గరకు వెళ్లి తెచ్చుకుంటున్నాం. లేచిన మొదలుకొని బిందెడు నీటి కోసం తిప్పలు తప్పడం లేదని మహిళలు వాపోయారు. గత మూడు నెలల నుండి గ్రామంలోనికి నీళు ్ల రాకపోవడంతో గ్రామం పక్కన ఉన్న వ్యవసాయ బోరు అయిన రైతు మల్లేశం దగ్గర నుంచి కరెంటు ఉన్నప్పుడే మంచినీటిని తెచ్చుకోవల్సి వస్తుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం వచ్చిందంటే నీటి కోసం అవస్థలు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో మంచినీటి కోసం లక్షలు మంజూరు చేస్తున్నాం అంటున్న నాయకుల, అధికారుల మాటలు కార్యరూపం దాల్చడం లేదని ఆగ్రహించారు. ప్రతేటా నీటి నిధులు ఎక్కడికి పోతున్నాయో కానీ గ్రామాల్లో అధికారులు నీటి సౌకర్యం కల్పించడం లేదని తలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

మా బాధలు పట్టించుకోవడం లేదు : పుష్పమ్మ

మా బాధలు ఎవరికి చెప్పుకున్నా పట్టించు కోవడం లేదు. ఎన్నోసార్లు అధికారులను, నాయకులను కలిసినా ఫలితం శూన్యమే. కనీసం చేతి పంపులైనా ఏర్పాటు చేయాలి.

ఏళ్ల తరబడి నీటితో కష్టాలు పడుతున్నాం : యాదమ్మ

ప్రతేడాదీ వేసవిలో మంచినీటి కోసం కష్టాలు పడుతున్నాం. ఉన్న బోరు దగ్గరే ఊరంతా నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుంది. అధి కారులు స్పందించి గ్రామంలో నీటి సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది.

కనీసం ట్యాంకర్లతోనైనా నీరు అందించాలి : పద్మ

గ్రామంలో మంచినీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గ్రామంలో నీటి సౌకర్యం లేదు. కనీసం ట్యాంకర్లతోనైనా నీటిని అందిస్తే బాగుంటుంది. ఓట్లడగడానికి వచ్చి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్తారు. గెలిచిన తరువాత తమ కష్టాలు పట్టించుకోవడం లేదు.