వేడి నీటి స్నానం
పూర్వ కాలం నుండి ధనికులు, బీదవారు అనే తేడా లేకుండా సాయంత్రం ఎండు కట్టెలతోనో, బాయిలర్ సహాయంతోనో, కరెంటుతోపని చేసే వాటరు హీటరుతోనో, వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి వేడినీటి స్నానం రోజూ చేయటం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. పగలంతా పని చేసి అలసిపోయాక సాయంత్రం వేడినీటి స్నానం చేస్తే ఎంతో సేద లభిస్తుంది. ఎంతో ఆహ్లాదాన్ని కల్గిస్తుంది. రాత్రిపూట సుఖంగా నిద్రకూడా వస్తుంది. జబ్బువల్లగాని, పనివల్లగాని, నీరసం వల్లగాని కండరాలు బిగుసుకు పోతే వేడినీటి స్నానంవల్ల గొప్ప ఊరట, సేద లభిస్తుంది. స్నానానికి వాడే నీటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ వుంటే మంచిది. అతివేడి పనికిరాదు. అర్ధగంటకంటే ఎక్కువ సేపు వేడినీటి తొట్టిలో (వుండేవారు) వుండరాదు. వేడి నీటి స్నానం తరువాత కొంచెం చల్లని నీటిని ముఖంపై చల్లుకుంటే మెదడుకు తిరిగి ఆక్సిజన్ తగినంత లభిస్తుంది. మెదడు సాధారణ స్థాయికి వస్తుంది. కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి వేడినీటి స్నానం ఎంతో ఉపయోగం. నడుంనొప్పి, యితర నొప్పులు తగ్గుతాయి. పొడిచర్మం కలవారు స్నానం తర్వాత ఏదైనా నూనె శరీరానికి రాసుకోవాలి.
సరిగ్గా తిండి దొరకనివారు, ఆస్పత్రి వైపుకు సరిగ్గా రానివారి కోసం కేంద్ర ప్రభుత్వం 1976లో జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశ జనాభాలో 13 శాతం 50 ఏళ్లుపైబడిన, 6.6 శాతం 60 ఏళ్లు పైబడినవారున్నారు. 50 ఏళ్లుపైబడిన బడినవారిలో అంధులు 8 శాతం ఉన్నారు. అంటే యాభై ఏళ్లు దాటిన వంద మందిని పరీక్షిస్తే అందులో 8 మంది 6 మీటర్ల దూరంలో వున్న చేతి వేళ్ళను లెక్కపెట్టలేరు.
జాతీయ అంధత్వనివారణ కార్యక్రమం
* ప్రజలకు కంటి జాగ్రత్తల గురించి వివరించటం.
* అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా, జిల్లా అంధత్వ నివారణ కమిటీల ద్వారా, స్వచ్ఛంద సేవాసంస్థల ద్వారా, సంబంధ నేత్ర శస్త్రచికిత్సా విభాగాల ద్వారా అన్ని జాగ్రత్తలు పాటించేలా చూస్తారు. కంటి శుక్లాల ఆపరేషన్లు చేయించి కళ్ళజోళ్లు లేక కంటిలోపల కృత్రిమ పారదర్శక కటకాన్ని అమరుస్తారు.
* టెరీజియం మొదలైన చిన్న ఆపరేషన్లు చేయటం.
* పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయటం.
* అంధత్వ నివారణకు ఆరోగ్య విద్య సమాచారం అందిచడం. బోధించడం.
కంటి శుక్లాలేకాక ట్రాకోమా, విటమిన్-ఎ లోపం, ఆంకో సెర్‌సియాసిస్, మీజిల్స్ అభివృద్ధి చెందుతున్నా దేశాల్లో అంధత్వానికి కారణాలవుతున్నాయి. వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి శుక్లాలకు వృద్ధులు అర్హతగల కంటి వైద్యాన్ని సంప్రదించి అతని సలహాలను పాటించి అవసరమైతే శస్త్ర చికిత్స చేయించుకోవాలి. అంధత్వాన్ని దూరం చేసుకుని మిగతా జీవితాన్ని గడపాలి.
గ్లాకోమా (నీటికాసులు)
వృద్ధాప్యంలో వచ్చే మరొక కంటి జబ్బు గ్లాకోమా లేక నీటి కాసులు. ఈ జబ్బులో దృష్టి క్షేత్రం తగ్గుతుంది. దూరపు దృష్టి తీవ్రత సాధారణంగా వుండవచ్చుకాని క్షేత్రం తగ్గుతుంది. కంటి నరం దెబ్బతింటుంది. దానితో చూపుక్షీణిస్తుంది. ప్రారంభదశలో గ్లాకోమా ఏ లక్షణాలు లేకుండా వుంటుంది. కంటిలో పీడనం పెరుగుతుంది. వయస్సు 40 ఏళ్లు మీరటం, కుటుంబ చరిత్రలో గ్లాకోమా ఉండటం, కంటిలో పీడనం పెరగటం, ఓపెన్ యాంగిల్ గ్లాకోమాకు కారణాలు అవుతాయి.
చికిత్స
దృష్టి కోల్పోటాన్ని వైద్యపరంగా మందుల ద్వారాగాని, శస్త్ర చికిత్స ద్వారాగాని నివారించోచ్చు. ఇవే కాక శస్త్ర చికిత్స ద్వారాగాని లేజరుద్వారాగాని నిర్వహించొచ్చు.
రెటినోపతీ (నేత్రాంత పటల వికృతి)
మధుమేహ వ్యాధిగ్రస్తులైన వృద్ధుల్లో నేత్రాంతపటల వికృతి అంధత్వానికి ఒక కారణం. మధుమేహ రోగుల్లో ఎంతో కొంత మేరకు వారి నేత్రాంత పటల రక్తనాళాల్లో మార్పులకు గురువుతారు. అయితే ఈ మార్పులు రక్తంలో గ్లూకోజు నిల్వలను నియంత్రించటాన్ని బట్టి వుంటుంది. ప్రారంభ దశలో వున్న మధుమేహ నేత్రాంత పటల వికృతి ఎటువంటి లక్షణాలను చూపదు. క్రమేపీ, ఆకస్మిక చూపు తగ్గుదలతో వస్తారు. అందువల్ల మధుమేహ రోగులందరూ ఏడాదికోసారైనా నేత్రవైద్యులచే కంటి పరీక్షలు చేయించుకోవాలి.
చికిత్స
'లేజర్ ఫోటో కోవాగ్యులేషన్' అనే పద్ధతిని మధుమేహ నేత్రాంత పటల వికృతి చికిత్సలో అనుసరిస్తారు.
జాగ్రత్తలు
ఈ క్రింది జాగ్రత్తలతో మధుమేహ నేత్రాంత పటల వికృతిని నియంత్రించ వచ్చును.
* నెమ్మదిగా గ్లూకోజు నియంత్రణ.
* రక్తంలో గ్లూకోజు స్థాయిని క్రమంలో ఉంచుకోవాలి.
* పొగత్రాగటాన్ని (నిషేధించుట) మానేయాలి.
తక్కువ చూపు సేవలు
మాక్యులా నశించటం వల్ల, కంటి శుక్లం వల్ల వృద్ధులకు చూపు తక్కువైతుంది. వీరికి 'తక్కువ చూపుకు సహాయక ఉపకరణాలను' ఇవ్వటం వల్ల మేలుజరుగుతుంది.
ఉపకరణాలు
* సాధారణ చేతి/స్టాండు భూతద్దాలు. పవరు 3-76 డయాస్టర్లు.
* కళ్లజోళ్ళ భూతద్దాలు పవరు 5-48 డయాస్టర్లు.
* టెలిస్కోపు
*ఎలక్ట్రానిక్ భూతద్దాలు.
చూపు కోల్పోయిన వారికి రాయితీలు
* భారత విమానయాన శాఖలో టికెట్లపై 50 శాతం రాయితీ.
* భారత రైల్వే శాఖలో టిక్కెట్లపై 75 శాతం రాయితీ.
* ఆదాయపు పన్ను మినహాయింపు.
* అంధులకు పంపే సాహిత్యంపై పోస్టలు శాఖ ఛార్జీలు మినహాయింపు.
వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి జబ్బుల గురించి అవగాహనతో డాక్టరును సంప్రదించాలి. తగు చికిత్స, జాగ్రత్తలు తీసుకోవాలి. తమ చూపును మెరుగుపరచుకొని తదుపరిజీవితాన్ని కొనసాగించాలి. అందుకు కుటుంబ సభ్యులు సహకరించాలి.
అనారోగ్య సమస్యలా ...?
అయితే మాకు రాసి పంపండి. ఆయా విభాగాల్లో అనుభవజ్ఞులైన వైద్యులతో సమాధానాలిప్పిస్తాం. ప్రశ్నలు పంపే వారు వయస్సు, బరువు, జబ్బుకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరచాలి.
చిరునామా :
సంపాదకులు, రక్ష, ప్రజాశక్తి దినపత్రిక, ప్లాట్ నెం. 21/1,
ఆర్‌టిసి కళ్యాణమండపం దగ్గర,
అజామాబాద్ ఇండిస్టియల్ ఏరియా, ముషీరాబాద్, హైదరాబాద్-20
గ మ ని క
రక్ష పేజీలో వైద్యులిచ్చే సలహాలు, సమాచారం కేవలం వ్యాధుల పట్ల మీ అవగాహన కోసం మాత్రమే. చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.
డా|| నాగినేని భాస్కరరావు
వృద్ధుల వైద్యనిపుణులు ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాల ,
ఆసుపత్రి సంగారెడ్డి. ఫోన్ : 94402 26008