రణగొణ ధ్వనులకు సెలవ్‌!

  • గ్రానైట్‌ క్వారీల్లో నిలిచిన పనులు
  • ఆగిన ఉత్పత్తి
  • అనుబంధ పరిశ్రమలపై ప్రభావం
  • 80 శాతం మూతపడ్డ కంకర మిల్లులు
  • స్వస్థలాలకు తరలుతున్న కార్మికులు

గత 12 రోజులుగా గ్రానైట్‌ గనుల్లో రణగొణ ధ్వనులు మూగబోయాయి. 'హంసా'లో ప్రమాదం జరిగినప్పటి నుండి అన్ని గనుల్లో పనులు ఆగిపోయాయి. గ్రానైట్‌ ఉత్పత్తి పూర్తి స్థాయిలో ఆగిపోయింది. ఈ పరిశ్రమపై ఆధారపడ్డ కంకర పరిశ్రమ ఫాలిషింగ్‌ యూనిట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముడిరాయి లభించక గ్రానైట్‌ అనుబంధ పరిశ్రమలు దాదాపు మూతపడే పరిస్థితి వచ్చింది. కంకర మిల్లుల్లో ముడిరాయి లేకపో వడంతో 80 శాతం మిల్లులు మూత పడ్డాయి. రాయి లేక ఫాలిషింగ్‌యూనిట్లకు తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముడిరాయి ఉన్న కొద్దిపాటి ఫాలిషింగ్‌ యూనిట్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. ఆయా పరిశ్రమలపై ఆధారపడ్డ కార్మికులు పనులు లేక స్వస్థాలకు తరలివెళ్తున్నారు. చీమకుర్తి ప్రాంతం లోని గనులపై ఆధా రపడి బూదవాడ, చీమకుర్తి, మర్రిచెట్లపాలెం ప్రాంతాల్లో సు మారు 250 ఫాలిషింగ్‌ యూనిట్లు ఉన్నాయి. గనుల్లో దొరికే ముడి రాయిని కొనుగోలు చేసి ఫాలిషింగ్‌ నిర్వహించి ఎగుమతులు చేస్తుంటారు. ఈ యూనిట్లలో ఒక్కోదానిలో కనీసం 20 మంది కార్మికులు పనిచేస్తుంటారు. ఒరిస్సా, రాజస్థాన్‌ రాష్ట్రాల నుండి సుమారు 5వేల మంది కార్మికులు ఈ ఫాలిషింగ్‌ యూనిట్లలో పనిచేస్తున్నారు. అంతేగాక కర్నూల్‌, కడప, కుప్పం ప్రాంతాల నుండి కూడా అనేక మంది కార్మికులు ఈ ప్రాంతానికొచ్చారు. రాజస్థాన్‌, జైపూర్‌, షోర్‌, ఒరిస్సాలోని భద్రక్‌, పాలేశ్వర్‌ ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చిన కార్మికులు ఫాలిషింగ్‌ యూనిట్లలో పనిచేస్తున్నారు. అడుగు రాయి ఫాలిషింగ్‌ నిర్వహిస్తే 3.25 కూలి ఇస్తారు. పొట్ట చేతపట్టుకుని వచ్చిన కార్మికులు గత 12 రోజులుగా పనులు లేక అల్లాడుతున్నారు. రాళ్లు నిల్వలేని ఫాలిషింగ్‌ యూనిట్లు ఆపారు. కొద్దిపాటి సంపాదన ఖర్చు పెట్టుకోలేక స్వగ్రామాలకు వెళ్లారు. చీమకుర్తి, బూదవాడ ప్రాంతాల్లో గనులపై ఆధారపడి సుమారు 100 కంకర మిల్లులు ఉన్నాయి. గత 12 రోజు లుగా క్వారీయింగ్‌ ఆగిపోవడంతో మిల్లులకు ముడిరాయి ఆగిపోయింది. అసలే తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న కంకర పరిశ్రమపై ముడిరాయి దెబ్బపడింది. 20 శాతం మిల్లులు ఆగిపోయాయి. నిల్వలు ఉన్న మిల్లులు ఆడుతున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు పనులు లేక కంకరకు డిమాండ్‌ తగ్గింది. దీంతో అమ్మ కాలుపడిపోయాయి. మిల్లులు ఆడకపోయినా కిస్తీలు, జీతాలుచెల్లించాల్సి రావడంతో యజమానులు అల్లాడుతున్నారు. కంకర ఇస్తే రాయి కొట్టే వారి రోజువారి కూలీలు క్వారీల్లో రాయి లేకపోవడంతో పనులు లేక ఇళ్ల వద్దనే ఉంటున్నారు. ఈ వంద మిల్లులపై 5 వేల మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు మూతపడ్డ క్వారీలు గా ప్రారంభం కాకపోతే గ్రానైట్‌ అనుబంధ పరిశ్రమలు శాశ్వతంగా మూతపడే అవకాశముంది.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్