రుణాల మంజూరులో ప్రభుత్వం విఫలం

ప్రభుత్వం డ్వాక్రా గ్రూపు మహిళలకు వడ్డీ రుణాలను అందజేస్తామని ప్రకటించింది. కానీ మండల స్థాయిలో పలు గ్రామాల్లోని డ్వాక్రా గ్రూపు సంఘాలకు రుణాలు ఇప్పించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డ్వాక్రా మహిళలు అంటున్నారు. మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో ఇప్పటికే ఏడు గ్రూపులకు చెందిన సభ్యులు వారు తీసుకున్న రుణాలను చెల్లించారు. పట్ట ణంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకు వారు డ్వాక్రా గ్రూపు మహిళలకు రుణాలను మంజూరు చేయటం లేదని ఆ గ్రూపుల సభ్యులు తెలిపారు. ఐకెపి సిబ్బందిని సంప్రదిస్తే త్వరలో మాట్లాడి ఇప్పిస్తామని చెబుతున్నారు. ఇంత వరకూ దాన్ని పట్టించుకున్న పాపానపోలేదు. పేపర్ల ప్రకటనల్లో మాత్రం అద్దంకి మండలంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా గ్రూపు మహిళలకు విపరీతంగా రుణాలు ఇప్పించామని చెబుతున్నారు గానీ ఆచరణలో మాత్రం ఏడు నెలలు గడిచినా కూడా తిరిగి రుణాలు ఇప్పించలేని స్థితిలో ఐకెపి సిబ్బంది ఉన్నారు. వికలాంగులు సంఘాలుగా ఏర్పడితే బ్యాంకుల ద్వారా రుణాలిప్పిస్తామని పలు సభలలో మాట్లాడినప్పటికీ ఆచరణలో మాత్రం వారికి పని చేసింది శూన్యమని పట్ట ణంలోని పలువురు వికలాంగులు తెలియజే స్తున్నారు. ఇకనైనా రుణాలు ఇప్పించటంలో ఐకెపి సిబ్బంది తమ వంతు కృషి చేయాలని డ్వాక్రా గ్రూపు సభ్యులు కోరుతున్నారు.