నగర పరిధిలోని బాలాజీ నగర్ మున్సిపల్ ప్రాధమిక పాఠశాలలో అదన పుతరగతి గదులు నిర్మించిన నెలరోజులకే నెర్రెలిచ్చాయి. రాజీవ్ విద్యామిషన్ శాఖ ద్వారా రెండు గదుల బిల్డింగ్ నిర్మాణానికి రూ.8 లక్షలకు టెండర్ ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కాంట్రాక్టర్ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తిచేశారు. బాత్‌రూం నిర్మాణాలను సగంలో ఆపివేశారు. నిర్మాణాలకు నాశిరకం సిమెంట్ వాడటంతో పాటు క్యూరింగ్ సరిగా చేయ కపోవడంతో రెండు గదుల బిల్డింగ్ పగులిచ్చాయి. బిల్దింగ్ పనులు నిమిత్తం 6లక్షల కాంట్రాక్టర్‌కు చెల్లించారు. మరో రెండు లక్షలు రావాల్సి ఉంది. ఇంజినీరింగ్ అది óకారులు కూడా బిల్డింగ్ నిర్మాణం సమయంలో తనిఖీలు చేసిన పరిస్ధితి లేదు. నేల పై వేసిన బండలూ ఎగుడుదిగుడుగా వేశారు. విద్యార్థులు కూర్చోవడానికి అనుకూలంగా లేదు. బాత్‌రూం నిర్మాణాలను సగంలో ఆపి మిగితావి మీరు నిర్మించుకోమని కాంట్రాక్టర్ చెబుతున్న పరిస్ధితి ఉంది. నిరంతరం విద్యార్ధులుండే బిల్డింగ్ నిర్మాణం నాశిరకంగా ఉంటే పరిస్ధితి ఏమిటని సిపిఎం నాయకులు రాపూరి శ్రీను ప్రశ్నించారు. నిర్మించిన బాత్‌రూం కూడా పాత బాత్‌రూం మెటిరి యల్‌ను వినియోగించి కట్టిందే గాని కాంట్రాక్టర్ సొంతగా మెటిరియల్ తెచ్చింది ఏమి లేదని సిపిఎం జోన్ నాయకులు రాపూరి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు తెలిపారు. నిర్మించిన నెలరోజులకే బిల్డింగ్ పగిలితే కొన్నాళ్ళకు బిల్డింగ్ పరిస్ధితి ఎలా ఉంటుం దోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసం పూర్తిగా నిర్మించిన బాత్‌రూం నిర్మాణాలను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, బిల్డింగ్‌కు మరమ్మత్తులు చేయాలని కోరారు.