డైయ్యింగ్ కార్మికులు మజూరీ పెరిగేవరకు పోరాటం కొనసాగించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె నారాయణ సూచించారు. చినగంజాం ఉప్పు భూముల కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు గురువారం చీరాల వచ్చిన ఆయన గత వారం రోజులుగా దీక్షల్లో ఉన్న డయ్యింగ్ కార్మికులను పరా మర్శించారు. కార్మికుల వేతన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చీరాల కన్నా తక్కువగా ఉన్న మంగళగిరిలోనే వేతనాలు బాగున్నాయని అదేవిధంగా ఇక్కడ కూడా వేతనాలు ఇచ్చేవరకు ఆందోళన సాగించాలని చెప్పారు. ఆందోళనకు తమ పార్టీ సంఘీబావం ఉంటుందన్నారు. ఆయన వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం వెంకయ్య, కెవివి ప్రసాద్, ఆర్ రవీంధ్రనాద్, ఎంఎల్ నారాయణ, ఆర్ వెంకట్రావు, బి లక్ష్మయ్య, పి అప్పారావు, శ్రీమ న్నారాయణ, నాగార్జున, డయ్యింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు బక్కా జయరామిరెడ్డి, బక్కాశ్రీనివాసరెడ్డి, శవనం ప్రసాదరెడ్డి ఉన్నారు.
ఉప్పుభూముల కేసు అక్టోబర్‌కు వాయిదా
చినగంజాం ఉప్పుభూములను పేదలకు పంచాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె నారాయణ నాయకత్వాన ఎర్రజెండాలు పాతిన కేసును అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేశారు.రెండేళ్ల కిందట జరిగిన భూపోరాటంలో 104మందిపై కేసులు నమోదు చేశారు. అందులో ఒకరు చనిపోయారు. మిగిలిన 103మందిలో గురువారం జరిగిన కోర్టు విచారణకు 35మంది గైర్హాజరయ్యారు. గైర్హాజరయిన వారిలో 29మందికి నాన్ బెయిల్‌బూల్ వారెంట్‌ను న్యాయమూర్తి జారీ చేశారు. సిపిఐ కార్యదర్శి నారాయణతో పాటు 67మంది హాజరైనట్లు న్యాయవాది బూదరాజు శశికిరణ్ తెలిపారు.
విజృంభిస్తున్న విష జ్వరాలు