31, 1 తేదీల్లో మెగా జాబ్‌ ఫెయిర్‌

స్థానిక ఎస్‌ఎస్‌ఎన్‌ Ê ఎస్‌వివిఎస్‌ఎన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ నెల 31, ఆగష్టు ఒకటో తేదీలలో మెగా జాబ్‌ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్లు కళాశాల అధినేత వై రామకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఎస్‌ఎన్‌, ట్యాలెంట్‌ పూల్‌ అకాడమీ హైదరాబాద్‌ వారి సహకారంతో ఈ జాబ్‌ ఫెయిర్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్పొరేట్‌ రంగంలో గ్రామీణ విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌, ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సరైన ఉద్యోగాలను కల్పించడమే తమ లక్ష్యమన్నారు. జాబ్‌ఫెయిర్‌లో జిల్లాలో మొట్టమొదటి సారిగా 10 కంపెనీల ప్రధాన హెచ్‌ఆర్‌ టీములు, 10 ఎంఎన్‌సీల ఎంపిక చేసే సభ్యుల బృందం పాల్గొంటున్నారని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు సాయంత్రం నియామక ఉత్తర్వులు ఇస్తామన్నారు. రాష్ట్రంలోని బిటెక్‌, బిఎస్సీ, బిఏ, బి.కాం, ఎంబిఏ, ఎంసిఏ, ఎంఎస్‌సి, పాలిటెక్నిక్‌ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జాబ్‌ఫెయిర్‌కు హాజరయ్యే విద్యార్థులు ముందుగా తమ కళాశాలలో పేర్లను రిజిష్టర్‌ చేయించుకోవాలని సూచించారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్