ఆర్‌డిఓ హామీతో దీక్ష విరమణ

  • ఙ నేతలను అర్ధరాత్రి బలవంతంగా
  • వైద్యశాలకు తరలించిన అధికారులు
  • వైద్యాన్ని నిరాకరించిన నేతలు
  • తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా

ఇళ్ళ స్థలాలు, సాగుభూమి, శ్మశానం, ఉపాధి, పక్కా గృహాల సమస్యలను పరిష్క రించాలని కోరుతూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నాలుగు రోజుల నుండి కొనసాగుతున్న నిరాహార దీక్షలను ఆర్‌డిఓ నరసింగరావు గురువారం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. 23 నుండి 25 వరకు రిలే దీక్షలు, 26 నుండి నిరాహారదీక్షలు చేస్తున్నా అధికా రులు స్పందించకపోవడంతో నేతలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. దీక్షలు చేస్తున్న మహిళా సంఘం నేత ఎస్‌కె మైమూన్‌ స్పృహ తప్పిపోవడంతో ఆమెను వైద్యశాలకు తరలించిన విషయం తెలిసిందే. సిఐటియు నాయకులు పిసి కేశవరావు, కెవిపిఎస్‌ నాయకులు బడుగు వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బొజ్జా సిద్ధయ్యలను నాటకీయ పరిణామాల మధ్య అధికారులు బుధవారం రాత్రి బలవంతంగా శిబిరం నుండి వైద్యశాలకు తరలించారు. నేతలు వైద్యాన్ని నిరాకరించారు. దీక్షలను కొనసాగించారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా తహశీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. నేతల ఆరోగ్యం క్షీణించడంతో పాటు ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ఆర్‌డిఓ స్పందించారు. నాయకులతో చర్చించారు. నేతలు కోరినట్లుగా 13 డిమాండ్లపై చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంంలో సిఐ కె ప్రకాశరావు, ఎంపిడిఓ వై మహాలక్ష్మి, తహశీల్దార్‌ కె వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా నాయకులు పి హనుమంతరావు, సిపిఎం కనిగిరి డివిజన్‌ కార్యదర్శి పి తిప్పారెడ్డి, టిడిపి నాయకులు బేరి పుల్లారెడ్డి, గూడూరు ఎరీక్షన్‌బాబు, రాచమల్ల శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్