పాలెంలో తాగునీటి ఎద్దడి(ఫొటో)

మండలంలోని పాలెంలో వారంనుండి తాగునీటి ఎద్దడి తీవ్రమైందని, గ్రామంలో తాగునీటి బోరుబావులు ఎండిపోయాయని గ్రామస్తులు వాపోతున్నారు. పెద్దవాగులో ఉన్న మంచినీటి బోరుబావుల సమీపంలో ప్రయివేటు వ్యక్తులు బోరుబావులు తవ్వడంతో మంచినీటి బోరుబావులు ఎండిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామంలో 60వేల లీటర్ల సామర్ధ్యం గల రెండు ట్యాంకులు ఉన్న ఒకట్యాంకైనా నిండడంలేదని స్థానికసర్పంచి గణేష్‌ తెలిపారు. ప్రయివేటు బోరుబావుల వల్ల గ్రామస్తులకు తాగునీరు అందించలేకపోతున్నామన్నారు. గ్రామకమిటీ తరపున ప్రయివేటుగా బోరుబావులు వేసిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. మండలాధికారులు స్పందించి తాగునీటిని అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్