ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2011-12 కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్న సందర్భంగా వివిధ అంశాలపై సభ్యుల ప్రతిస్పందనలు
* బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు లోక్‌సభలో అడుగుపెడుతున్న ప్రణబ్‌కు పార్టీలకు అతీతంగా సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. రెండు చేతులు జోడించి నమస్తే అంటూ చిరునవ్వులు చిందిస్తూ ప్రణబ్ సభలో అడుగుపెట్టారు. ప్రతిపక్ష బిజెపి సభ్యుల వైపు తిరిగి ప్రత్యేక సమస్కార బాణాలు వదలడం గమనార్హం. ప్రధాని మన్మోహన్‌సింగ్, యుపిఎ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభలో ఆసీనులై ఉన్నారు. సభ్యుల మాటలను ఆలకిస్తూనే ఇరువురూ కొద్ది సేపు ముచ్చటించుకోవడం కన్పించింది.
* చదవడానికి అనుకూలంగా ఎదురుగా బల్లను ఎత్తుగా ఉంచిన తరువాత సోమవారం ఉదయం 11.02 గంటలకు ప్రణబ్ ప్రసంగం మొదలు పెట్టారు. 12.50 గంటలకు ముగించారు. ప్రణబ్ మధ్యలో రెండు సార్లు దాహం తీర్చుకునేందుకు బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం కొద్ది సేపు ఆపారు.
* కేటాయింపుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష సభ్యులు నిరసనగా బల్లలు చరిచారు. అవినీతిపై జిఒఎం ఏర్పాటు చేస్తామన్నప్పుడు, ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలు పశ్చిమబెంగాల్, కేరళ, అసోంకు అదనపు నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు.
* కిరోసిన్‌కు నేరుగా సబ్సిడీ, సమాచార హక్కు, విద్యా హక్కును ప్రస్తావించినప్పుడు అధికార పక్ష సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
* బడ్జెట్ సభకు యువనేత రాహుల్ గైర్హాజరయ్యారు.న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2011-12 కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్న సందర్భంగా వివిధ అంశాలపై సభ్యుల ప్రతిస్పందనలు
* బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు లోక్‌సభలో అడుగుపెడుతున్న ప్రణబ్‌కు పార్టీలకు అతీతంగా సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. రెండు చేతులు జోడించి నమస్తే అంటూ చిరునవ్వులు చిందిస్తూ ప్రణబ్ సభలో అడుగుపెట్టారు. ప్రతిపక్ష బిజెపి సభ్యుల వైపు తిరిగి ప్రత్యేక సమస్కార బాణాలు వదలడం గమనార్హం. ప్రధాని మన్మోహన్‌సింగ్, యుపిఎ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభలో ఆసీనులై ఉన్నారు. సభ్యుల మాటలను ఆలకిస్తూనే ఇరువురూ కొద్ది సేపు ముచ్చటించుకోవడం కన్పించింది.
* చదవడానికి అనుకూలంగా ఎదురుగా బల్లను ఎత్తుగా ఉంచిన తరువాత సోమవారం ఉదయం 11.02 గంటలకు ప్రణబ్ ప్రసంగం మొదలు పెట్టారు. 12.50 గంటలకు ముగించారు. ప్రణబ్ మధ్యలో రెండు సార్లు దాహం తీర్చుకునేందుకు బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం కొద్ది సేపు ఆపారు.
* కేటాయింపుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష సభ్యులు నిరసనగా బల్లలు చరిచారు. అవినీతిపై జిఒఎం ఏర్పాటు చేస్తామన్నప్పుడు, ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలు పశ్చిమబెంగాల్, కేరళ, అసోంకు అదనపు నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు.
* కిరోసిన్‌కు నేరుగా సబ్సిడీ, సమాచార హక్కు, విద్యా హక్కును ప్రస్తావించినప్పుడు అధికార పక్ష సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
* బడ్జెట్ సభకు యువనేత రాహుల్ గైర్హాజరయ్యారు.