ఈ నెల 23 నుండి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య తెలిపారు. శనివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో 3వేలా 500 కోట్ల నుండి 3వేల కోట్లకు తగ్గించి సబ్సిడీల నుండి ప్రభుత్వం తప్పుకోవడం తప్ప మరొకటి కాదని విమర్శించారు. బోగస్ కార్డుల ఏరివేత పేరుతో సర్వే చేసి అర్హుల పేర్లను తొలగిస్తున్నారన్నారు. కొత్త రేషన్‌కార్డు దారులకు ఇంత వరకు రేషన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అర్హుల కార్డులు తొలగిస్తే ప్రజా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 30 కిలోల బియ్యం, కందిపప్పు, కిరోసిన్ కోటా పెంచాలని, పంచదార కేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం డివిజన్ అధ్యక్షులు కొండేటి జలంధర్, ఎస్.కె.బీబమ్మ, రమేష్, వెంకటే శ్వర్లు, వజీర్, బాలసైదులు, అంకెపాక సైదులు పాల్గొన్నారు.
విజయవాడ సభను జయప్రదం చేయండి: సిపిఎం
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం
కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలి: సిఐటియు
ప్లీనరీ సమావేశంలో... మూడో ప్రత్యామ్నాయంపై చర్చ : చెరుపల్లి
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
మధ్యాహ్న భోజన పంపిణీలో విబేధాలు
సుద్దాల స్ఫూర్తితో ఉద్యమించాలి
కడుపులో ఇనుప పరికరం వైద్యురాలి నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన
ఉద్యమాలు ఉధృతం చేయాలి : సిపిఎం