ఉపాధిహామీ నిధులను దారి మళ్లించి కూలీలకు అన్యాయం చేస్తే ఊరుకోం : వెంకట్‌

పేదల ఉపాధిహామీని పెద్దల ఉపాధిహామీగా మార్చి ఉపాధిహామీ నిధులను దారి మళ్లిస్తూ కాంట్రాక్టర్ల జేబులు నింపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కూలీలకు అన్యాయం చేస్తే తాము చూస్తూ ఊరుకుబోమని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ అన్నారు. బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌ అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆ సంఘం ఆధ్వర్యంలో ఉపాధిహామీ వర్కింగ్‌ మేట్‌, మేస్త్రీల అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ కార్మిక సంఘం, వామపక్షాల పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధిహామీ పథకం నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తుందన్నారు. పాలకులు రూ.12 వందల కోట్ల నిధులను రోడ్లు, గ్రామపంచాయతీ బిల్డింగ్‌ల పేరుతో దారి మళ్లించి అవినీతికి పాల్పడాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు అర్హులైన వారందరికీ రేషన్‌, పింఛన్లు ఇచ్చి, ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కిన వెంటనే బోగస్‌ కార్డుల పేరుతో అర్హుల రేషన్‌ కార్డులను తొలగిస్తున్నారన్నారు. నిరుపేదలకు పనులు కల్పించడానికి ఫిిక్స్‌డ్‌ లేబర్‌ గ్రూప్‌ ఏర్పాటు చేస్తున్నారన్నారు. దాని ఉద్ధేశం దెబ్బతినకుండా ఉండాలంటే ఎస్సీ, ఎస్టీలతో పాటు బిసిలకు, ఇతర పని చేసే వారందరికీి గ్రూపులో చేర్చుకోవాలన్నారు. వారికి రోజు కూలి రూ.150లు ఇచ్చి ఆదుకోవాలన్నారు. వర్కింగ్‌ మేట్లకు ప్రభుత్వం సైకిల్‌, గుర్తింపు కార్డులు అందించాలన్నారు. పెరుగుతున్న నిత్యవసర ధరలను నియంత్రించాలన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యవసర వస్తువులను పేదలకు అందించాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 30 కిలోల బియ్యం వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమస్యల పరిష్కారానికి వర్కింగ్‌మేట్లు, కూలీలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ములకలపల్లి రాములు, నారి అయిలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌ కార్యదర్శి మట్టిపల్లి సైదులు, నాయకులు వర్దెల్లి బుచ్చిరాములు, అబ్బగాని బిక్షం, చిన్నపంగి నర్సయ్య, రణపంగ కృష్ణ, కామళ్ల లింగయ్య, గుంజా వెంకటేశ్వర్లు, గంపల యల్లయ్య, బొప్పాని సులేమాన్‌, గుంటి వెంకటేశ్వర్లు, మామిడి మరియమ్మ, బొప్పాని కనకమ్మ, నెమ్మాది లకిëతో పాటు 200 మంది మేట్స్‌, మేస్త్రీలు పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్