మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కక్కిరేణి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. మేడబోయిన సైదులు, మేడబోయిన మారమ్మ(28) వ్యవసాయమే వృత్తిగా జీవి స్తున్నారు. 12 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కొద్దిపాటిగా ఉన్న తన సొంత భూమిలోనే అనేక బోర్లు వేయగా ఒక బోరులో నీరు పడడంతో పైప్‌లైన్ వేసి వ్యవసాయం సాగిస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు పూర్తిగా ఎండి పోవడంతో చేసిన అప్పులు తీరలేని పరిస్థితి నెలకొనడంతో దిక్కుతోచని ఆ రైతు కుటుంబం మే 28న తన సొంత వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామస్తులు, బంధువులు చూసి రామన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మేడబోయిన మారమ్మ మృతి చెందింది. భర్త సైదులు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. మృతురాలి తండ్రి మర్రి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చింతా మోతీరామ్ పేర్కొన్నారు.