రైతులు అధిక దిగుబడులు సాధించేలా చూడాలి : కలెక్టర్‌

వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి గ్రామగ్రామాన పర్యటించి వచ్చే ఖరీఫ్‌లో రైతులు అధిక దిగుబడులు సాధించేలా చూడాలని కలెక్టర్‌ ఎన్‌.ముక్తేశ్వర్‌రావు సూచించారు. 10వ తేదీ నుండి ప్రారంభమయ్యే రైతు చైతన్య యాత్రలను గురువారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారుల సూచనలు, సలహాలను పాటించాలన్నారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడిఎ జయరాజు, పశుసంవర్థక శాఖ జెడి ఖదీర్‌, మార్కెటింగ్‌ శాఖ ఎడి ప్రసాదరావు, ఆర్‌డిఓ పద్మాకర్‌, హార్టికల్చర్‌ ఎడి బాబు, ట్రాన్స్‌కో డిఇ శంకరయ్య, తహశీల్దార్‌ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Publiture