ఈ నెల 16న తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో మన్నెం యాదగిరి అధ్యక్షతన ఆ సంఘం మండల శాఖ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంవత్సరాల కాలంగా ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ దశలవారిగా పోరాటాలు చేస్తున్నామన్నారు. 2008డిఎస్సీ అప్రెంటీస్ ఉపాధ్యాయులకు సర్వీస్ టైం స్కేల్ ప్రారంభ వేతనం చెల్లించాలని కోరారు. అనంతరం జిల్లా ప్రధానా కార్యదర్శి సిహెచ్.రాములు మాట్లాడుతూ యాక్టు 37/2005 సవరించి, యాక్టు టీచర్ ఆన్‌ఎయిడెడ్ సర్వీస్‌కు రక్షణ కల్పించాలన్నారు. పండిట్, పిఇటి పోస్టులకు స్కూల్‌అసిస్టెంట్ పోస్టులుగా అఫ్‌గ్రేడ్ చేయాలని ఎంఇఓ, డివైపిఓ లెక్చరర్ పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శులు ఎన్. సోంబాబు, పి. యాకయ్య, కె. సత్తయ్య, రమేష్, దానయ్య పాల్గొన్నారు.
మిర్యాలగూడ టౌన్ : ఉపాధ్యాయుల సమస్యలపై ఈ నెల 16న తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. లక్పతినాయక్ కోరారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ డిఎస్సీ-08 ఉపాధ్యాయుల అప్రెంటీస్ సర్వీస్‌కి టైమ్ స్కేల్‌లోని ప్రారంభ వేతనం చెల్లించాలని, నెలకు రూ.398 వేతనంతో పని చేసిన టీచర్ సర్వీస్‌కి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాక్ట్ 37/2005 సవరించి ఎయిడెడ్ టీచర్ల అన్‌ఎయిడెడ్ సర్వీస్‌కి రక్షణ కల్పించాలని, యాక్ట్ 37/2005 రద్దు చేసి అప్‌గ్రేడెడ్ పండితుల జీతాలకు రక్షణ కల్పించాలన్నారు. పండిట్, పిఇటి పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేయాలని, మోడల్ స్కూల్ టీచర్స్‌గా ప్రభుత్వ ఉపాధ్యాయులను అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పి. రమణారెడ్డి, కృష్ణారెడ్డి, లచ్చయ్య, శ్రీనివాసరెడ్డి, బాలరాజు, శ్రీనివాసాచారి, చిన వెంకన్న, ఎల్. రాజు, వెంకటాచారి, జానయ్య, వెంకట్‌రెడ్డి, కోటానాయక్, నర్సరాజు, సైదులు, చంద్రారెడ్డి పాల్గొన్నారు.