300 ప్రింట్లతో 31న 'వరుడు'

అల్లు అర్జున్‌ హీరోగా గుణశేఖర్‌ దర్శకుడిగా యూనివర్సల్‌ మీడియా పతాకంపై డివివి.దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం 'వరుడు'. మార్చి 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికైనా వధువు ఎవరనేది చెప్పలేనని నిర్మాత శనివారంనాడు మీడియాతో అన్నారు. వధువు గురించి రకరకాల కథనాలు వస్తున్నాయనీ, సినిమాలో ఇంటర్‌వెల్‌కుముందే వధువును చూపిస్తామనీ అన్నారు. వధువుగా నటించిన అమ్మాయి అమృత్‌సర్‌కు చెందినవారని తెలిపారు. పెండ్లి తంతు ఐదు రోజులు జరగడం నేపథ్యంగా 'వరుడు' సినిమా రూపొందిందని అన్నారు. 300 ప్రింట్లతో సినిమాను విడుదల చేస్తున్నామని చెప్పారు. కేరళలో అల్లు అర్జున్‌ సినిమా ఆడుతుంది గనుక అక్కడ డబ్బింగ్‌ చేస్తున్నామన్నారు. పెండ్లితంతుపై చాలా చిత్రాలు వచ్చినా ఇంత వైవిధ్యంగా ఏ చిత్రమూ రాలేదనీ చెబుతూ... అల్లు అర్జున్‌ కెరీర్‌లో వసూళ్ళపరంగా రికార్డ్‌ బ్రేక్‌ చేస్తుందని నమ్మకంగా చెప్పారు. తమిళ హీరో ఆర్య విలన్‌గా నటిస్తుండగా, సింగీతం శ్రీనివాస్‌ తాతయ్యగా నటించారనీ కథ నచ్చి వారు నటించడానికి ముందుకువచ్చారని పేర్కొన్నారు. షూటింగ్‌మొత్తం హైదరాబాద్‌లోనే తీశామన్నారు. బ్రహ్మానందం, నరేష్‌, సుహాసిని, షిండే తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాజశేఖర్‌, మాటలు: తోటప్రసాద్‌.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్