వందనం అభినందనం...అంటూ ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావుపై చిత్రించిన పాట గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ పాటనే రీమిక్స్‌గా దాసరి నారాయణరావు కొత్తవారితో ప్రయోగం చేస్తున్నారు. 'యంగ్ ఇండియా' చిత్రం కోసం రామోజీ ఫిలింసిటీలో షూట్ చేస్తున్నారు. ఇప్పటి యువతరానికి మంచి సందేశాన్ని ఇచ్చేలా వారిని ఆలోచింపజేసేలా ఈ చిత్రముంటుందని నిర్మాత కృష్ణప్రసాద్ తెలియజేస్తున్నారు. మరోవైపు ప్రసాద్ ల్యాబ్స్‌లో రీరికార్డింగ్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఏప్రిల్‌లో పాటలు, మేలో సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.