హిందీలో సైఫ్ అలీఖాన్, దీపికా పదుకొనె జంటగా నటించిన 'లవ్ ఆజ్ కల్' విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం రీమేక్‌లో పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్నట్లు తెలియవచ్చింది. గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయభాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషలు రాస్తున్నారు. వీరికాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలన్నీ విజయాన్ని సాధించాయి. ఆ తర్వాత కొద్దికాలంపాటు వీరిద్దరూ విడివిడిగా చిత్రాలు చేయడంతోపాటు త్రివిక్రమ్ దర్శకుడిగాకూడా మారారు. దాంతో ఇద్దరికీ విజయావకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం తివిక్రమ్ మహేష్‌బాబు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌కళ్యాణ్ 'కొమరం పులి' చిత్రంలోనటిస్తున్నారు. ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలు ఇంకా పూర్తికావాల్సి ఉంది. అయితే ఈ తాజా చిత్రాన్ని ఈనెల 29న లాంఛనంగా ప్రారంభించడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.