హీరోకు 8 మార్కులే : అక్కినేని

'ఎటువంటి సినిమా అయినా అందులో హీరోకు దక్కేవి కేవలం 100కు 8 మార్కులే. ఇది నేను చెప్పిందికాదు. వరల్డ్‌ స్టాటిస్టిక్స్‌. గతంలో నన్ను ఇంటర్వ్వూ చేయడానికి ఒకరు వచ్చారు. మీరు ఫలానా చిత్రంలో భలే డ్రెస్‌వేశారు. చాలా బాగుంది అన్నారు. అది నాది కాదు కాస్ట్యూమ్స్‌వారు ఇచ్చారు అన్నా. ఆ తర్వాత పలానా సన్నివేశంలో డైలాగ్‌లు, ఆ తర్వాత పాటలు.. ఫైట్లు.. ఇలా ఒక్కొక్కటికీ భలే చేశారని అభినందించారు.. అవన్నీ నేను చేయలేదు. రచయితు రాస్తారు, ఫైట్లు వాళ్లేచేస్తారు. వల్సివస్తే డూప్‌ ఉంటారు. నేను పాడను. గాయకులు పాడతారు. అని చెప్పగానే.. ఇంతకీ మరి మీరు చేసేదేమిటి? అని అడిగారు.. నేను చేసింది దర్శకుడు చెప్పింది ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటూ చెడకొట్టకుండా ఉండటమే. హీరోకు బాగాపేరు వచ్చిందంటే.. దాని వెనకాల ఎంతో మంది కృషి ఉంటుంది. మంచికథ ముఖ్యం. దాన్ని రాసేది వేరేవారు. కోట్లు పెట్టి తీసేది నిర్మాత. అందుకే నా దృష్టిలో హీరోకు 8 మార్కులే ఇస్తాను.. ' అంటూ 'ఏ మాయ చేసావె' చిత్రం సక్కెస్‌మీట్‌లో అక్కినేని చెప్పారు. ఈ చిత్రం గురించి, ఆయన మనవడి గురించి వివరిస్తున్నారిలా..

లోపాలున్నాయి సరిదిద్దుకోవాలి !

మనవడు అయినా నేను గొప్పలు చెప్పలేదు. మా వాడిలో చాలా లోపాలున్నాయి. మొదటి చిత్రంకంటే రెండవదానిలో బెటర్‌. ఇంకా లోపాలు సరిద్దుకుని ముందుకు సాగాలి అని సూచించారు. అలాగే కృష్ణగారి అమ్మాయి మంజుల నా దగ్గరకు వచ్చి అంకుల్‌ ఒక కావ్యంలాంటి సినిమా చేస్తున్నాను అని చెప్పారు. సీనియర్‌ నటుడిగా నిర్మాతగా కష్టాలు తెలుసు కాబట్టి జాగ్రత్త అని చెప్పాను. సెక్స్‌, హింస రాజ్యమేలుతున్న సమయంలో చిన్న కథను తీసుకుని చెడులేకుండా చక్కగా తీశారు. పెడధోరణి పడుతున్న సినిమాను ట్రెండ్‌సెట్టర్‌గా ఈ చిత్రం నిలుస్తుంది. నా మనవడి పాత్రలో కష్టంలేదు. నేనూ గతంలో లైలామజ్ఞు, దేవదాసు వంటి ఎన్నో ప్రేమకథా చిత్రాలు చేశాను. వాటిల్లో హీరోయిన్‌ పాత్రే చాలా కష్డపడాలి. అలాంటి కష్టం సమంత పడింది. ఆమె ఫేస్‌లో హావభావాలు చక్కగా పలుకాయి. మనవడిలో లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుంటే మంచి నటుడవుతాడు.చిత్ర నిర్మాత మంజుల మాట్లాడుతూ...'నాన్నగారు ఈ సినిమా చూసి హ్యాపీగా ఫీలయ్యారు. రెండు కుటుంబాలు కలిసి తీస్తున్న ఈ చిత్రం పోకిరి అంత హిట్‌ అవుతుందని చెప్పారు. చైతన్య మా ఇంటి హీరో. టాలెంట్‌ ఉంది. లవ్‌స్టోరీని దర్శకుడు గౌతమ్‌మీనన్‌ చక్కగా చూపించారు' అని తెలిపారు. నాగార్జున మాట్లాడుతూ...'ఈ సినిమా చూడగానే వెంటనే 'గీతాంజలి'లా ఉంటుందని ముందే చెప్పా. ఈ కథానాయిక జెస్సీ కోసం మూడుసార్లు సినిమా చూశాను. చిత్ర యూనిట్‌ అంతా వస్తే బాగుండేది. దర్శకుడు, సంగీత దర్శకుడు అందుబాటులో లేరు. ఇది టెక్నీషియన్‌మూవీ. నా అభిమానులు కూడా ఇందులో ఫైట్స్‌ లేవు అనకుండా సినిమాను ఆదరించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా' అన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్