'మైలోస్ ఐలాండ్‌లో ఓ పాట చేశాం. అక్కడ ఇళ్లన్నీ తెల్లటి మంచులా ఉంటాయి. మరో రంగు ఏ ఇంటికీ కనబడదు. కిటికీలుకూడా వైట్‌తోపాటు బ్లూ ఉంటుంది. అది పర్యాటక ప్రాంతం. అక్కడ జనాభా 5వేలు. ఆరునెలలు పర్యాటకులు రారు. మిగిలిన ఆరు నెలలు వారికి పని. మేం షూటింగ్ చేసే సమయం ఫ్రీగా ఉంది. పర్యాటకులురాని రోజుల్లో వెళ్ళాం. మాకు మొత్తం ఐలాండ్ ఇచ్చేశారు. మాకోసం మూసివున్న హోటల్ తెరిచి ఆతిథ్యం ఇచ్చారు. అక్కడివారికి వేరే వృత్తంటూ ఏమీలేదు. ప్రతీ ఒక్కరికి ఓ బోటు ఉంటుంది. చేపలు పట్టడమే వారి వ్యాపకం. చల్లటి బీర్ సేవిస్తూ..చేపలతో భోజనం చేస్తూ కాలక్షేపం చేస్తారు. మాకు భోజనం పెడితే మేమంతా పది నిముషాల్లో ముగించాం. అది చూసి వారు ఆశ్చర్యపోయారు. భోజనం బాగోతలేదా? అని అడిగారు.. మేము ఇలాగే తింటాం అని చెప్పగానే.. ఆశ్చర్యపోయారు... మనం ఇంత కష్టపడేది భోజనం కోసమేగా.. అందుకే భోజనాన్ని ఎంజారు చేస్తూ తినాలని సూక్తి చెప్పారు. అక్కడివారంతా.... భోజనానికి కూర్చుని కబుర్లతో కాలక్షేపం చేస్తూ... మరోపక్క వేడి వేడి వంటకాలు తింటూ ఎంజారు చేస్తున్నారు' అంటూ 'కేడి' చిత్రం కోసం గ్రీస్ వెళ్చొచ్చిన నాగార్జున అక్కడి సంగతులు తెలిపారు.
రమ్మీ అనేది క్యారెక్టర్‌పేరు
రమ్మీ అనేది క్యారెక్టర్ పేరు. పూర్తిపేరు రమేష్. అంతా రమ్మీ అంటుంటారు. రమ్మీ అనేది ఓ గేమ్ కూడా. ఆ గేమ్‌ను బాగా ఆడతాడు. దాన్ని ఆడాలంటే ...గోవా వెళ్ళాల్సిందే. ఇక్కడయితే పోలీసులతో ప్రాబ్లమ్. అందుకే 40రోజులు అక్కడే షూటింగ్ చేశాం. పాత్రపరంగా చెప్పాలంటే.. చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన అతని జీవితాన్ని మార్చేస్తుంది. అతని జీవితంలో డబ్బే ప్రధానం. దీన్నే కథాంశంగా తీసుకుని 'కేడి' రూపొందింది. ప్రేమ, ఆప్యాయతా, అనురాగాలు...వంటి వాటిని లెక్కచేయడు. డబ్బే సర్వసం. గుంటూరు నుంచి హైదరాబాద్ ..అక్కడనుంచి గోవా వెళ్ళే రమ్మికథే కేడి.
మొదటి భాగం ప్రశ్శా పత్రం..
కేడి చిత్రం మొదటి భాగం ప్రశ్నాపత్రం. దీనికి జవాబుపత్రంగా రెండోభాగం ఉంటుంది. సినిమా చూస్తే ఇదే ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో నాకు నచ్చిన పాట 'కేడి' టైటిల్‌సాంగ్. నాన్నగారు చేసిన..'ము..ముద్దంటే చేదా..' పాటను రీమిక్స్‌చేశాం. ఈ పాట షూటింగ్ అప్పుడు నా వయస్సు 10 సంవత్సరాలు. సారథి స్టూడియోలో నాన్నగారిపై చిత్రిస్తుంటే చూశాను.
బాలీవుడ్ వరల్డ్ మార్కెట్...
బాలీవుడ్ తరహాలో టాలివుడ్ చిత్రాలు రావడంలేదని చాలామంది అడుగుతుంటారు. రెండింటికి చాలా వ్యత్యాసముంది. ఒక్కో సినిమాకు మార్కెటింగ్ ఏజెన్సీ ఉంటుంది. 10మంది మార్కెటింగ్ ఏజెంట్లుంటారు. వారంతా చర్చించి ఎటువంటి చిత్రాన్ని తీయాలి.. ఎంత ఖర్చవుతుంది ! మార్కెట్ ఎలా చేయాలనేది వారి వృత్తి. అందులో భాగంగా ప్రమోషన్‌కు కోట్లరూపాయలు వెచ్చిస్తుంటారు. ఆ తరహా విధానాన్ని తెలుగులో తీసుకురావాలని చూశాం. బాలీవుడ్ నుంచి ఆ ఏజెన్సీ వస్తే...వారికి ఆతిథ్యం ఇవ్వడానికే కోటిదాకా ఖర్చవుతుంది. మన మార్కెట్ ప్రపంచవ్యాప్తంకాదు. అందుకే ఆ దశలో అడుగులు వేయలేకపోయాం. బాలీవుడ్ మార్కెట్ చాలా విస్త్రతమైంది. పదిరేట్లు అభివృద్ధి సాధించింది. మన ఇండిస్టీలో అది రావడం ఇప్పట్లో జరిగేపని కాదు.