మూడు భాషల్లో 'విధాత' డైలీ సీరియల్‌

రంగనాథ్‌, ప్రసన్నకుమార్‌, లిరీష, రూపారెడ్డి ప్రధాన పాత్రలలో దువ్వూరి క్రియేషన్స్‌ పతాకంపై శ్రీమతి డి.మంజుల నిర్మాతగా సురేష్‌ కలగ దర్శకత్వంలో ఎబ్‌కో సమర్పణలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'విధాత' అనే మెగాడైలీ సీరియల్‌ రూపుదిద్దు కొంటుందని దర్శక, నిర్మాతలు తెలిపారు. రాజకీయ, సామాజిక అంశాలతోపాటు కుటుంబ సంబంధాలు ఇందులో ప్రతిబింబిస్తాయిన తెలియజేశారు. నటుడు రంగనాథ్‌ మాట్లాడుతూ..'మన దేశ నాగరికత అన్ని దేశాల నాగరికతల కంటే ప్రాచీనమైనది. మన కళలు, సంస్కృతి చాలా విశిష్టమైనవి. ఇటువంటి పాయింట్‌తో వస్తున్న సీరియల్‌. ఇందులో నాది ప్రధానమైన పాత్ర. అందరినీ ఆలోచింపజేస్తూ, పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుంది' అని తెలియజేశారు. నటుడు ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ..'ఇందులో నేను ప్రధానపాత్ర పోషిస్తున్నా.దేశ రాజకీయాలు. అందులోని లోపాలు..ఎత్తిచూపుతూ ప్రతీ ఎపిసోడ్‌ ఉత్కంఠభరితంగా సాగుతుంది. చిత్రయూనిట్‌తో పాటు దర్శక,నిర్మాతలకు ఈ సీరియల్‌ అవార్డుల పంట పండిస్తుందని అందరూ తమ తమ ఆశాభావాలు వ్యక్తం చేశారు.ఇంకా ఉదరుశరత్‌, గోపాల్‌కృష్ణ ఆకెళ్ల, ఎఫ్‌.ఎమ్‌.బాబారు, కోటేశ్వరరావు, శ్రీలక్ష్మి, శోభ, త్రిష, కల్పన చౌదరి నటిస్తున్న సీరియల్‌లో నటిస్తున్నారు.కెమెరా: ఎస్‌.ఎన్‌.మురళీకృష్ణ, కథ:డి. రవికుమార్‌, నిర్మాత:శ్రీమతి డి.మంజుల, టెలీప్లే-దర్శకత్వం :సురేష్‌ కలగ.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్