తమన్నాతో తప్పక చేయాల్సిందే !

తమన్నా ఎంత క్లాస్‌గా కనిపిస్తుందో, అంత మాస్‌గానూ వుంటుంది. 'రెబల్‌' సినిమాలో ఆమె వేసిన మాస్‌ డ్యాన్స్‌లు ఏ రేంజ్‌లో దుమ్మురేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బహుశా తమన్నాలోని ఆ మాస్‌ అప్పీల్‌ బాలీవుడ్‌ హీరో అక్షరుకుమార్‌కి బాగా నచ్చేసినట్టుంది. అందుకే తన తదుపరి సినిమాలో తమన్నాని హీరోయిన్‌గా బుక్‌ చేసుకున్నాడతను.

ప్రస్తుతం తమన్నా బాలీవుడ్‌లో 'హిమ్మత్‌వాలా' సినిమా చేస్తోంది. ఈ సినిమాలో అజరుదేవగన్‌ హీరో. 'హిమ్మత్‌వాలా' సినిమా ఇంకా రిలీజ్‌ కాలేదుగానీ, ఆ సినిమాలో తమన్నా డ్యాన్సులు చూసి అక్షరుకుమార్‌ ఫిదా అయిపోయాడట. అంతే, తమన్నా తెలుగులోనూ, తమిళంలోనూ నటించిన సినిమాలన్నీ ప్రత్యేకంగా వీక్షించి, తమన్నాతో తదుపరి సినిమా చేయాల్సిందేనని అక్షరుకుమార్‌ డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను రమేష్‌ తురానీ నిర్మించనున్నారు.

అన్నట్టు, అజరుదేవగన్‌ నటించిన 'సింగమ్‌'లో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తే, ఆమెను తన 'స్పెషల్‌ 26' సినిమాలో తీసుకున్నాడు అక్షరుకుమార్‌. ఇప్పుడు 'హిమ్మత్‌వాలా' సినిమాలో అజరు సరసన నటించిన తమన్నాను తన తదుపరి సినిమాలో హీరోయిన్‌గా అక్షరు రికమండ్‌ చేస్తున్నాడు !