శ్రీదివ్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం 'నేను నేనే రామూనే'. బతకనేర్చిన బుద్ధిమంతులకు మాత్రమే అన్నది ట్యాగ్‌లైన్. సాయివెంకట్ యాదవ్ ఈ సినిమాతో పరిచయమవుతున్నారు. సందీప్తి, పరిణితి, కృష్ణుడు, తాగుబోతు రమేష్, కొండవలస, వీరభద్రం, శ్రీ శశాంక్ ముఖ్య తారాగణం. ఆడియో విడుదల జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..'సినిమా తెరకెక్కడానికి కేవలం ఏవియస్ రాజు మాత్రమే కారణం. ప్రపంచంలో స్వేచ్ఛగా జీవించే వ్యక్తి వర్మ. ఆయన స్వేచ్ఛగా సినిమాలు తీస్తారు. ఆయన జీవిత చరిత్రను ఎంతో స్వేచ్ఛగా తెరకెక్కించా. ప్రతికూలంగా ఉంటుందా ! సానుకూలంగా ఉంటుందా ! అని చాలామంది అడిగారు. ఆయన గురించి నా అభిప్రాయాన్ని భయపడకుండా తెరకెక్కించా. మ్యూజిక్, ఫోటోగ్రఫీ హైలైట్ అవుతుంది' అని తెలిపారు.
java.lang.NullPointerException