* గబ్బర్‌సింగ్ విజయంతో సినిమాతో కథానాయిక శృతిహాసన్ డేట్స్ కోసం దర్శకనిర్మాతలు వేచి చూస్తున్నారు. సినిమాలే కాకుండా కమర్షియల్స్ కూడా బాగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వజ్రాల ఆభరణాల ప్రాడక్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి ఆమె సంతకం చేసిందట.
* ప్రస్తుతం సూర్యా, కాజల్ జంటగా 'మాత్రన్' (తెలుగులో డూప్లికేట్) చిత్రాన్ని రూపొందిస్తున్న తమిళ ఛాయాగ్రహకుడు, దర్శకుడు కె.వి.ఆనంద్..త్వరలో రజనీకాంత్‌ని డైరెక్ట్ చేయనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందని కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఆనంద్ చెప్పిన కథకి రజనీ ఓకే చెప్పాడట. గతంలో రజనీ నటించిన 'శివాజీ' చిత్రానికి ఆనంద్ కెమెరా వర్క్ చేశాడు.
* గోపీచంద్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో తాను చేసే సాహసాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని కథానాయిక తాప్సీ అంటోంది. ఇందులో తన పాత్రకి తానే డబ్బింగ్ కూడా చెబుతానని, తన యాస బాగుంటుందని ఆమె చెబుతోంది.
* ఐస్ ఏజ్ 3- డి హాలీవుడ్ చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రం పిల్లల్ని విశేషంగా ఆకట్టుకుంటుందని నిర్మాతలు అంటున్నారు. తెలుగు వెర్షన్ కాపీని ఈనెల 27న విడుదల చేస్తున్నారు.
* ఇటీవల 'దేవుడు చేసిన మనుషులు' చిత్రానికి సంగీతం అందించిన గాయకుడు రఘు కుంచెలో చాలా కళలున్నాయి. త్వరలో కెమెరామెన్‌గా కూడా మారడానికి ప్రయత్నిస్తున్నాడట.
* ఓ తమిళ దర్శకుడు తన సినిమాలో ఒక పాటను ముద్దులతో నింపేస్తున్నాడు. 'శీను రామస్వామిన్ నీరుపరవై' అనే చిత్రంలో హీరో హీరోయిన్లు ఒక పాటలో 100 సార్లు ముద్దుపెట్టుకుంటారట !
* 'ఈగ' సినిమా రిలీజయినప్పటి నుంచీ ఇంట్లో ఈగ కనిపిస్తే 'నాని వచ్చాడు..' అంటూ అందరూ ఈగల్ని ముద్దుగా పిలుచుకుంటున్నారని దర్శకుడు రాజమౌళి చెబుతున్నాడు. మరి, నాని కనిపించినప్పుడు 'ఈగ వచ్చింది..' అంటున్నారా ! అంటూ టాలీవుడ్‌లో జోకులు పేలుతున్నాయి !
* బ్రహ్మానందం ప్రధాన పాత్రధారిగా వెన్నెల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'జఫ్ఫా' చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. జైలు బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈసినిమాలో నాలుగు పాటలు కూడా వున్నాయట !