గ్రాఫిక్స్‌లో డమరుకం

నాగార్జున, అనుష్క కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'డమరుకం'. శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో డా|| వెంకట్‌ నిర్మిస్తున్నారు. ఒక్కపాట మినహా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జూలై రెండోవారంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నాగార్జున చిత్రం గురించి చెబుతూ... ''నా కెరీర్‌లో తొలిసారిగా ఇటువంటి ఫాంటసీ మూవీ చేస్తున్నాను. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో చేశారు. నా కెరీర్‌లోనే హై బడ్జెట్‌ మూవీ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇది నాకు చాలా పెద్ద రేంజ్‌ సినిమా అవుతుంది'' అన్నారు. నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ... ''ఒక పాట మినహా షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్‌ వర్క్‌ జరుగుతోంది. నాగార్జునగారి కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్‌ మూవీ అవుతుంది. జూలై రెండోవారంలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... ''ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌లాంటి పెద్ద బేనర్‌లో ఇంత భారీ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాగార్జునగారి కెరీర్‌లోనే ఇదో పెద్ద ల్యాండ్‌ మార్క్‌ మూవీ అవుతుంది. నిర్మాత వెంకట్‌గారు ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ సినిమా తీస్తున్నారు'' అన్నారు.

కో-ప్రొడ్యూసర్‌ వి.సురేష్‌రెడ్డి మాట్లాడుతూ - ''ఓ పక్క ఈ చిత్రానికి సంబంధించిన ప్యాచ్‌వర్క్‌ జరుగుతోంది. మరో పక్క పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో భాగంగా ఎడిటింగ్‌, డబ్బింగ్‌ ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై రెండోవారంలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కథ: వెలిగొండ శ్రీనివాస్‌, పాటలు: జొన్నవిత్తుల, చంద్రబోస్‌, భాస్కరభట్ల, సాహితి, రామజోగయ్యశాస్త్రి, కరుణాకర్‌, సమర్పణ: కె.అచ్చిరెడ్డి,

Sorry

java.lang.NullPointerException