బెల్లంకొండ సురేష్ నిర్మిస్తోన్న 'బస్‌స్టాప్' చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. మారుతీ దర్శకత్వం వహిస్తుండగా, ప్రిన్స్, నందితలు జంటగా నటిస్తున్నారు. తొలి సన్నివేశానికి బెల్లంకొండ సురేష్ క్లాప్‌నివ్వగా, వివి.వినాయక్ కెమరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...'మారుతీ దర్శకత్వంలో ఇటీవలే విడుదలై సక్సెస్ అయిన 'ఈరోజుల్లో' చిత్రంలో నటించిన కొందరు నటీనటులు, టెక్నీషియన్లు, 'నీకు-నాకు'లో నటించిన నందిత, ప్రిన్స్‌లను మా చిత్రంలో నటీనటులుగా ఎంపిక చేశాం. 'బస్‌స్టాప్' అనే టైటిల్ సురేష్ కొండేటి తన చిత్రం కోసం రిజిస్టర్ చేసుకున్నారు. మా కథను ఆయనకు చెప్పి ఈ టైటిల్ సరిపోతుందని, అడగ్గానే సరేనన్నారు. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. మారుతీ స్క్రిప్ట్ వర్క్, సాంగ్స్ రికార్డింగ్ పూర్తయ్యాక నా వద్దకు వచ్చి కథ చెప్పాడు. కథ నాకు బాగా నచ్చింది. 'ఈరోజుల్లో' కన్నా ఎంటర్‌టైనింగ్ అనిపించింది. మే 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఒకే ఒక షెడ్యూల్‌తో పూర్తి చేస్తాం' అని అన్నారు.
దర్శకుడు మారుతీ మాట్లాడూతూ...'ఈరోజుల్లో సినిమాతో దర్శకునిగా పరిచయమైన నాకు వెంటనే మరో అవకాశం రావటం ఆనందంగా ఉంది. నేను రాసిన స్క్రిప్ట్ నమ్మి ఈరోజుల్లో తీసే అవకాశం ఇచ్చారు. పెద్ద హిట్ అయిన మా యూనిట్ అంతటికీ మంచి పేరు తెచ్చింది. ఆ చిత్ర లోగో ఆవిష్కరణకు వచ్చిన బెల్లంకొండ సురేష్ నన్ను ప్రోత్సహించి మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పమన్నారు. ఈ కథను సంవత్సరం నుంచీ తయారు చేస్తున్నా. మొదటి సినిమా కన్నా 'బస్‌స్టాప్' మరింత ఎంటర్‌టైన్‌గా ఉంటుంది' అని అన్నారు.
java.lang.NullPointerException