ఆరు రోజులు...అరవై లక్షలు...

మిల్కీవైట్‌ భామ తమన్నా కూడా తన ఇమేజ్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటోంది. ఈ మధ్య సౌత్‌లో ఆమె ఇమేజ్‌ బాగా పెరగడంతో ప్రచారకర్తగా పలు సంస్థలు ఆమె వెంటపడుతున్నాయి. తాజాగా ఓ శీతల పానీయ సంస్థ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఇన్నాళ్లూ ఈ బ్రాండ్‌కి దక్షిణాది తార జెనీలియా పనిచేసింది. అయితే ఆమె పెళ్లి చేసుకోవడంతో సదరు కంపెనీ మరో భామ కోసం ప్రయత్నించి, చివరికి తమన్నాను నియమించుకుంది.

ఏడాదికి ఆరు రోజుల కాల్‌ షీట్స్‌ ఆమె ఈ సంస్థకి కేటాయించాల్సి వుంటుంది. ఆ ఆరు రోజుల్లోనూ ఫోటో షూట్స్‌, ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటుంది. అందుకుగాను ఏడాదికి రూ.60 లక్షల పారితోషికాన్ని తమన్నాకు ఇవ్వడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ...'ఎండార్స్‌మెంట్స్‌ విషయంలో నేను చాలా సెలక్టివ్‌గా ఉంటున్నాను. నా వయసుకి, ఇమేజ్‌కి తగ్గ విధంగా వుండే వాటినే అంగీకరిస్తున్నా'నని బదులిచ్చింది.

Sorry

java.lang.NullPointerException