డిస్కోలో మహేష్‌బాబు!

నిఖిల్‌, సారాశర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'డిస్కో'. స్టైల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై హరి కె. చందూరి దర్శకత్వం వహిస్తున్నారు. అభినవ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆనంద్‌ సంగీతాన్ని సమకూర్చారు. మంత్ర తర్వాత అంతటి సంగీతం ఈ చిత్రంలో ఉందనీ, ఒకనాటి మిథున్‌ చక్రవర్తి చేసిన 'డిస్కోడాన్సర్‌'ను గుర్తు చేస్తుందని ఇటీవలే విడుదలైన ఆడియో వేడుకలో సునీల్‌ అన్నారు. ఇదే అభిప్రాయాన్ని వినాయక్‌, ముత్యాల సుబ్బయ్య తెలియజేశారు. ఈ చిత్రం మొత్తం డాన్స్‌ నేపథ్యంలో సాగుతుంది. నిఖిన్‌ ఎనర్జిటిక్‌ లెవల్‌ రీత్యా జూనియర్‌ రవితేజ అనే పేరుందని నిఖిల్‌ను పలువురు ప్రశంసించారు. నిఖిల్‌ ఆడియోవేడుకలో డాన్స్‌ పెర్‌ఫార్మెన్స్‌ను ప్రదర్శించారు. చిత్ర ట్రైలర్‌ను విడుదలచేశారు. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ... ఇందులో చిన్న ట్విస్ట్‌ ఉంది... మహేష్‌బాబుకూడా మా చిత్రంలో గెస్ట్‌రోల్‌ ప్లే చేశారని చెప్పారు. వెంటనే ట్రైలర్‌ ఆవిష్కరించగా, అందులో మహేష్‌బాబు నటించిన 'బిజినెస్‌మేన్‌'లో సన్నివేశం కన్పిస్తుంది. ముంబైకు తానెందుకు వచ్చానో... అంటూ.. పలికే సంభాషణలు మహేష్‌వాయిస్‌తో ఉంటాయి. కానీ ఆ సన్నివేశం మాత్రం కామెడీ ఆర్టిస్టు ఎం.ఎస్‌. నారాయణపై చిత్రీకరించారు. ఈ సన్నివేశం ఎంజారు చేసేట్లుగా ఉంది. రిలీజ్‌ తర్వాత మహేష్‌ వాయిస్‌ను ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి. కాగా, పూరీ జగన్నాథ్‌ దగ్గర పనిచేసిన హరి ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో ఆ సన్నివేశం పెట్టారు. ఈ చిత్రం రెండు గంటలపాటు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతుందని నిఖిల్‌ తెలిపారు.

"); -->