తెలుగు చలన చిత్ర పరిశ్రమకు జాతీయ స్థాయిలో గుర్తింపు లేకపోవడం విచారకరమైన ప్పటికీ, తగిన అవార్డు రావాలని ఆశించడం దురాశే అవుతుందని ప్రముఖ దర్శకుడు తేజ తేల్చి చెప్పారు. ఇటీవల జాతీయ స్థాయి అవార్డుల్లో తెలుగు సినిమాలు పోటీ పడినా, ఏ ఒక్క చిత్రానికి అవార్డు దక్కకపోవడం పట్ల ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మన తెలుగు సినిమాలు గుడ్డెద్దు చేలో పడిన చందంగా ఉన్నాయని, ఏ సినిమాలోనూ సరయిన క్లారిటీ లేదని పేర్కొ న్నారు. తాను నిర్మించిన చిత్రాల విజయంపై వ్యాఖ్యానిస్తూ ఏదో దైవాధీనంగా విజయవంత మయ్యాయేకానీ, తాను సరైన సినిమాలు అవార్డు స్థాయిలో చేయలేదని చెప్పారు. రామానాయుడు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన వారికి ఆయన చేతుల మీదుగా డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు తన వద్ద పనిచేస్తున్నారని వారిని చూసి నేను చాలా నేర్చుకుంటున్నానని అన్నారు.