కూల్‌ డ్రింక్స్‌ మానండి : జెవివి

ప్రజల ఆరోగ్యాలకు హని కలిగించె కూల్‌డ్రింక్స్‌ను మాని సహజ పోషక విలువలు కలిగిన పండ్ల రసాలు, కొబ్బరి బోండాలు, మజ్జీగా లాంటివి తాగలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యాదర్శి రమేష్‌ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. జనవిజ్ఞాన వేదిక పటాన్‌చెరు శాఖ అధ్వర్యంలో స్ధానిక పోలిస్‌స్టేషన్‌ ఎదురుగా ఉగాది పచ్చడి, మజ్జీగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రమేష్‌ బాబు ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సామాన్యమానవులకు అందుబాటులో ఉండే ప్రకృతి సహాజ సిద్దంగా లభించే పోషక విలువలు గల వాటిని తాగడం వలన మనిషి ఆరోగ్యంగా ఉంటూ వేసవి తాపం నుండి ఉపశమనం పొందవచ్చని అన్నారు. కూల్‌డ్రింక్స్‌ తాగడం ద్వారా ఎటువంటి ప్రయోజం లేకపోగా ఆరోగ్య, ఆర్ధిక నష్టాలు ఎక్కువని ఆయన పేర్కొన్నారు. విదేశి బహులజాతి సంస్ధయైనా కొకకోళా సంవత్సరానికి 20వేల కోట్ల వ్యాపారం చేస్తు మన దేశ ఆర్ధిక వ్యవస్థను, పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆయన తెలిపారు. చిన్న పిల్లలు కూల్‌డ్రింక్స్‌ త్రాగడం వల్ల స్థూలకాయం బారిన పడిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవిజ్ఞాన వేదిక కూల్‌డ్రింక్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా ఆసుపత్రుల్లో, విద్యాసంస్ధల్లో, నిశేధించడం జరిగిందన్నారు. గత 5సం||రాలుగా జనవిజ్ఞాన వేదిక వెలుగులోకి తెస్తున్నా వస్తావాల ద్వారా కూల్‌డ్రింక్స్‌ అమ్మకాలు రోజు రోజుకు పడిపోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు జె.వి.వి, మండల అధ్యక్ష కార్యదర్శులు హనుమంత్‌ రెడ్డి, పెద్దన్న, గౌరవ అధ్యక్షులు డా||రాజ్‌కుమార్‌, డా||నాగేశ్వర్‌, టి.డి.పి నాయకులు మధుసుదన్‌ రెడ్డి, రాంచంద్రా రెడ్డి, కాసాల రమేష్‌, బానుప్రకాశ్‌, మాణిక్యం, జయరాంరెడ్డి, దర్మరాజు పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్