గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఎంపిడివో కౌసల్యదేవి అన్నారు. బుధవారం మండలంలోని రిమ్మనగూడ, కొడకండ్ల, దాతర్‌పల్లి గ్రామాల్లో తాగునీటిపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో నెలకొన్న తాగునీటితో పాటు పారిశుద్ధ్యం నిర్వాహణపై చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. దీనికోసం టాస్క్‌పోర్స్ కమిటీని వేసినట్లు ఆమె తెలిపారు. ఈ కమిటీలో తహశీల్దార్‌తో పాటు ఎఇ ఆర్‌డబ్ల్యుఎస్, ఎఇ ట్రాన్స్‌కో అధికారులు షెడ్యూలు ప్రకారం ఈ టాస్క్‌పోర్సు కమిటీని వేసినట్లు తెలిపారు. గ్రామాల్లో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యలు జఠిలం కాకముందే అధికారుల దృష్టికి తీసుకరావాలని ఆమె కోరారు. అంతేకాకుండా కరెంటు సమస్య కూడా తాగునీటికి కొంత ఆటంకం కల్గిస్తుందని కొంతమంది గ్రామస్తులు టాస్క్‌పోర్సు కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్లు తెల్సింది. బోర్లలో నీరు ఉన్నప్పటికీ విద్యుత్ లేకపోవడం వల్ల సమస్య జఠిలమవుతుందని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. టాస్క్‌పోర్సు కమిటీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని విఆర్‌ఒ కార్యదర్శులకు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సూర్యప్రకాశ్, ట్రాన్స్‌కో ఎఇ నవాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుండి మరిన్ని గ్రామాల్లో.....
ప్రస్తుత వేసవికాలంలో మండలంలో 26 గ్రామపంచాయతీలతో పాటు మదిర గ్రామాల్లో తాగునీటి, విద్యుత్, పారిశుధ్యం సమస్యలు తెలుసుకునేందుకు గురువారం నుండి మండల పరిధిలోని మిగతా గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు ఎంపిడివో కౌసల్యదేవి తెలిపారు. ఈ నెల 11న ముట్రాజ్‌పల్లి, లింగరాజ్‌పేట, క్యాసారం, సంగాపూర్ గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12న అనంతరావుపల్లి, రాగట్లపల్లి, 15న అహ్మదీపూర్, కొల్గూరు. శేర్‌పల్లి, దిలాల్‌పూర్, 17న దాచారం, బూర్గుపల్లి, సింగాటం, పిడిచెడు, 18న జాలిగామ, బయ్యారం,బెజుగామ, 19న అక్కారం, కోనాపూర్, శ్రీగిరిపల్లి, వడ్డెరవాడ,20న కోమటిబండ, రంగంపేట్, మక్తమసాన్‌పల్లి, అమ్మద్‌నగర్, బంగ్లావెంకటాపూర్, 22న గజ్వేల్, రాజిరెడ్డిపల్లి, సంగుపల్లి, ధర్మారెడ్డిపల్లి, గిరిపల్లి, 23న ప్రజ్ఞాపూర్, గుండున్నపల్లి, కోదండరాంపల్లి, తిమ్మక్కపల్లి తదితర గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు టాస్క్‌పోర్సుకమిటీ పర్యటిస్తుందని ఆమె తెలిపారు.