ప్రభుత్వం నిర్ణయాలతో కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వారికి శాపాలుగా మారుతున్నాయి. ఆదుకోవల్సిన ప్రభుత్వం అప్పుల పాలు చేయడానికి సిద్ధపడుతోంది. గ్రామాల్లో, పట్టణాల్లో తక్కువ సంఖ్యలో ఉండి తమ కులవృత్తి అయిన క్షౌరం పనిని చేసుకునే నాయి బ్రహ్మాణులకు ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న పన్ను విధానం ద్వారా వారి బతుకులు దుర్భరస్థితిలోకి నెట్టివేj ుబడుతున్నాయి. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం నాయిబ్రహ్మాణుల వ్యాపారసంస్థల పై 4 వందల నుండి 4వేల రూపాయలు పన్నులు విధించడానికి సిద్ధమవుతోంది. దీంతో అంతంత మాత్రంగా జరిగే వ్యాపారం ప్రభుత్వ పన్నుల చెల్లింపుకే తమ సంపాదన సరిపోతుందని వృత్తిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాము బతకడానికి బయట అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయని నాయిబ్రహ్మాణులు వాపోతున్నారు. రోజంతా పని చేస్తేనే తమ పిల్లలను పోషించుకుంటూ షాపులకు అద్దెలు కడుతున్నామని, ఇప్పుడు తమ పై ప్రభుత్వం అధిక పన్నులు విధిస్తే తమ కుటుంబాలు వీధిన పడే అవకాశాలున్నాయన్నారు. ఈ వృత్తి వల్ల రోజంతా నిలబడి పనిచేయడం మూలంగా మోకాళ్ల నొప్పులతో పాటు నరాల బలహీనత, శ్వాసకోశ వ్యాధులు, కంటి చూపు మందగించడం, మూత్ర సంబంధ వ్యాధులు గురౌతున్నామని పేర్కొంటున్నారు. వీటిని నయం చేసుకోడానికి కార్పోరేట్ ఆసుపత్రులకు వెళ్లడానికి డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కవుతున్నాయని వాపోతున్నారు. పట్టణంలోని క్షౌర దుకాణాదారులు నెలకు సంపాదించిదంతా అద్దె ఖర్చులు, కరెంట్‌బిల్లు, కాస్మోటిక్స్, ఇంటి సామాను, పిల్లల చదువులకు వెయ్యి రూపాయల వరకు పోగా తమకేమి మిగలడం లేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం తమ పై విధించబోయే పన్ను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేనియెడల అనేక ఆత్మహత్యలు శరణ్యమని వాపోతున్నారు.
నిరుద్యోగులుగా మారే అవకాశం ఉంది : శ్రీనివాస్, నాయిబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులు
చదువురాక కులవృత్తినే నమ్ముకొని పని చేసుకుంటున్నాం. ప్రభుత్వ విధానాల వల్ల షాప్‌బంద్ చేసుకొని నిరుద్యోగులుగా మారే అవకాశం ఉంది. పన్ను విధానాన్ని రద్దు చేయాలి.
రోజంతా కష్టపడితేనే పూటగడిచేది : సాగర్ (సాగర్ హెయిర్ స్టైల్)
కిరాయికి తీసుకొని షాప్‌ను నడిపిస్తున్నాం. రోజంతా కష్టపడితేనే తమ పిల్లలను పోషించుకుంటున్నామని, ప్రభుత్వం కొత్తగా పన్ను విధానాన్ని ప్రవేశపెడితే తమ బతుకులు బజారున పడతాయి. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.