ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

  • డంపు యార్డును త్వరలోనే నిర్మిస్తాం
  • పారిశుధ్య చర్యలు చేపడతాం
  • మున్సిపల్‌ నూతన కమిషనర్‌ సంతోష్‌కుమార్‌

గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ నగర పంచాయతీ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని, పారిశు ధ్య చర్యలు చేపడతామని నూతన మున్సిపల్‌ కమిషనర్‌ నాంపల్లి సంతోష్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం గజ్వేల్‌ నగరం పంచాయతీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పంచాయతీలోని మురుగు కాల్వలు, ఇతర సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. నగర పంచాయతీలో ముట్రాజ్‌పల్లి, ప్రజ్ఞాపూర్‌, లకీëప్రసన్న నగర్‌లలో సందర్శించి వారి సమస్యలు తెలుసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా తాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. పట్టణంలో ఉన్న సంపు హౌజ్‌లను పరిశీలించినట్లు ఆయన చెప్పారు. పట్టణంలో ఉన్న సంపు హౌజ్‌లను శుభ్రం చేయిస్తామన్నారు. మురుగు కాల్వల పరిశుభ్రతకు కెమికల్‌ మందులు తెప్పిస్తామన్నారు. నగర పంచాయతీలో విద్యుత్‌ దీపాలు అన్ని వార్డుల్లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నగర పంచాయతీలో డంపు యార్డు ఏర్పాటుకు కావాల్సిన స్థలం , నిధుల అన్వేషణ చేస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే నర్సారెడ్డి సహకారం తీసుకుంటామన్నారు. నగర పంచాయతీలో డంపు యార్డు లేకపోవడంతో చెత్తను అక్కడక్కడా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యంగా నగర పంచాయతీలో ప్రజారోగ్యం మీదనే ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగర పంచాయతీ అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. వర్షం కాలమైనందున పరిశ్రమల ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌, క్యాసారం, ముట్రాజ్‌పల్లిల్లో నెలకొన్న మౌలిక సదుపాయాలకు కృషి చేస్తానన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్