గత ఖరీప్‌లో వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయిన రైతులకు మంజూరైన ఇన్‌పుట్ సబ్సిడీ జమ కాకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నంగునూరులో చివరగా ముగిసే రైతు చైతన్య యాత్రలను రైతులు, గ్రామస్తులు అధికారులతో వాగ్వివాదానికి దిగి బహిష్కరించారు. రానున్న ఖరీఫ్‌లో వేసే ఎరువులు, విత్తనాలు నేటికి అందుబాటులో లేవని వ్యవసాయాధికారి మోహన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. పంటలు కోల్పోయన రైతులను ప్రభుత్వం నేటికీ బీమా పరిహారం ప్రకటించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితం అవుతుంది తప్ప ఏ రైతుకూ పావలావడ్డీ రుణాలు అందించారో చెప్పాలని అధికారులకు ప్రశ్నించారు. రైతులకు మేలు చేయని చైతన్య యాత్రలు ఎందుకంటూ బహిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్, విద్యుత్ శాఖ అధికారులు రాములు, సత్యం, ఆదర్శ రైతులు, ఉట్టి పల్లి శ్రీనివాస్, రాగుల వెంకట్ నర్సు, రైతులు మల్లేశం, నారాయణరెడ్డి, పర్శురాములు, రజినికర్‌రెడ్డి, కనకయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దౌల్తాబాద్: గత కొంత కాలం నుండి నిర్వహించిన రైతు చైతన్య యాత్ర మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో గురువారం రోజు నామామాత్రపు ముగిసాయి.ప్రభుత్వం ఎంతో పటిష్టంగా రైతలను చైతన్య వంతం చేయడం కోసం ప్రవేశపెట్టిన రైతు చైతన్య యాత్రలు వ్యవసాయాధికారుల నిర్లక్ష్యం మూలగా తూతూ మంత్రంగా సాగించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి అనీల్ కుమార్, అన్ని శాఖల అధికారులు, పాల్గొన్నారు.
దుబ్బాకరూరల్ : అధునాతన పద్దతుల ద్వారా రైతులు వ్యవసాయం చేసినట్లైతే అనాధికాలంలో రైతులు ఆర్థికాభివృద్ధి సాణతీస్తారని దుబ్బాక వ్యవసాయాధికారి మల్లేశం తెలిపారు. రైతు చైతన్య యాత్రలోభాగంగా గురువారం దుబ్బాక మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల ద్వారా వ్యవసాయం చేస్తే రైతులకు నష్టలు తప్పవని తెలిపారు. సేంద్రి యా ఎరువుల ద్వారా రైతులు పంటల సేద్యం చేసినట్లైతే అధిక దిగుబాడులు వచ్చి ఆర్థికాభివృద్ది సాధిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు అర్జున్, ఆదర్శరైతులు, రైతులు పాల్గొన్నారు.