వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శనివారం రూ.10 లక్షలు మంజూరు చేసిందని కేంద్ర ఫిలిం బోర్డు డైరెక్టర్ శేరి సుభాష్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పేరూర్ వద్ద మంజీర పుష్కరాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మెదక్ ఎంపి విజయశాంతి ప్రత్యేక చొరవతో మెదక్ మండలం కూచన్‌పల్లి గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంతకుమార్ లేఖను అందించినట్లు తెలిపారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎంపికి సుభాష్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు కిష్టాగౌడ్, అంజాగౌడ్, టివి ప్రసాద్, కిష్టయ్య, యస్.నారాయణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
మంజీరా పుష్కరాలకు సుమారు 10వేల మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేశారు. పూజారి దొర్బల రాజమౌళిశర్మ భక్తులకు ఇబ్బందు లు కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.