సమాచారహక్కుచట్టం రక్షణ వేదిక ఫిర్యాదుపై స్పందించిన అధికారులు

ఎప్రిల్‌4న జిల్లాలో ప్రభుత్వ నిబందనలకు విరుద్ధంగా కొన్ని వైద్య సంస్థలు నడుస్తున్నట్లు సమాచారహక్కుచట్టం రక్షణ వేదిక సంగారెడ్డి కన్వీనర్‌ శ్రీధర్‌గుప్తా బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారుల అనుమతి లేకుండా సేవలనందిస్తున్న ప్రయివేటు అస్పత్రులు, స్కానింగ్‌సెంటర్లు, లాబ్‌లపై సమాచారహక్కుచట్ట రక్షణవేదిక చేసిన ఫిర్యాదుపై జిల్లా వైద్యాధికారులు స్పందించారని, అందుకోసం సీనియర్‌ వైద్యాధికారులను నియమించి తనిఖీలు నిర్వహించారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 8స్కానింగ్‌ సెంటర్లపై జరిమానా విధించి, మూడు సెంటర్లకు నోటిసులు జారీ చేసినట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి లిఖిత ప్వూకంగా సమాధానమిచ్చినట్లు ఆయన తెలిపారు.

జిల్లాలోని అన్ని వైద్యసంస్థలపై సమగ్రవిచారణ నిర్వహించి రోగులకు నాణ్యమైన సేవలందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.


Publiture