యానిమేటర్ల గోడు పట్టదా?

  • సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం : సిఐటియు

24 రోజులుగా యానిమేటర్లు సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా దున్నపోతుపై వాన పడిన చందంగా వ్యవహరిస్తుందని సిఐటియూ దుబ్బాక మండల అధ్యక్షులు చంద్రారెడ్డి ఎద్దెవ చేశారు. సిఎల సమ్మె బుధవారం నాటికి 24వ రోజుకు చేరింది. సిఐటియూ దుబ్బాక మండల అధ్యక్షులు చంద్రారెడ్డి మద్దతు తెలిపారు. ఇప్పటికైనా వారి సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమలు చేపాడుతామని హెచ్చరించారు. ఈ సమ్మెలో సిఏలు లక్ష్మణ్‌, యాదగిరి, విజయ, సునీత, మమత, రజిత పాల్గొన్నారు.

నంగునూరు : ఇందిరాక్రాంతి పథకంలో పని చేస్తున్న సిఏల సమస్యలను పరిష్కరించాలని సిఏల సంఘం అధ్యక్షురాలు రేకులపల్లి పద్మ, మండల ప్రధాన కార్యదర్శి జహీర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం నంగునూరు ఐకెపి కార్యాలయం ఎదుట సిఏలు చేస్తున్న సమ్మె 24 వరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సమ్మెకాలంలో ప్రభుత్వం వెలువరించిన జిఓ నేటికీ అమలు కాలేదన్నారు. ప్రభుత్వం ఒప్పందాలు అమలు చేయకుండా సిఏలతో వెట్టి చాకిరి చేయించుకుంటోందని ఆరోపించారు. డిమాండ్లను సాధించేవరకు ఆందోళనలు కొనసాగించాలన్నారు. వీరికి గ్రామైఖ్య సంఘం విఓ లీడర్లు, సభ్యులు, సిబ్బంది సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఏలు రమాదేవి, వెంకటేశం, శ్రీశైలం, విజరుకుమార్‌, అయోద్య, సంతోష, నర్సింహ్మారెడ్డి, చంద్రకళ, ప్రభాకర్‌, విజరుకుమార్‌, పులిరాజు, కిష్ఠారెడ్డి పాల్గొన్నారు.

కొల్చారం : యానిమేటర్ల సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన సమ్మె బుధవారానికి 24 రోజుకు చేరింది. ప్రభుత్వం వెంటనే సిఎలకు ఉద్యోగ భద్రత కల్పించి, గౌరవ వేతనం పెంచాలని సిఐటియు డిమాండ్‌ చేసింది.

జోగిపేటటౌన్‌ : ఐకెపిలో పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని అందోల్‌ మండల సిఎలు సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు అశోక్‌, మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలు బుధవారం 24వ రోజుకు చేరాయి. ఈ కార్యక్రమంలో నాయకులు బాబయ్య, మల్లేశం, సుగుణ, సువర్ణ, అనసూయ తదితరులు పాల్గొన్నారు.