'సబ్‌ప్లాన్‌ అమలుకు చట్టం చేయాలి'

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు చట్టం చేసి దళితుల నిధులు పక్కదారికి మళ్లించకుండా వారి అభివృద్ధికే వినియోగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ తాలూకా కన్వీనర్‌ ఆర్‌.సూర్యసాగర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఉదయం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. సబ్‌ప్లాన్‌ తాలూకా కన్వీనర్‌ సూర్యసాగర్‌, కెవిపిఎస్‌ తాలూకా నాయకుడు పరంజ్యోతి, సుధాకర్‌ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంటరానితనం ప్రారద్రోలేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లోను దళితులు వివక్షకు గురౌతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. పల్లెలోను దళితులు దేవాలయాలు, రెండు గ్లాసుల పద్ధతి వంటి వివక్షలను ఎదుర్కొంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని వారు హెచ్చరించారు. నూతన కమిటీ అధ్యక్షులు కె.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు ఎ.మద్దిలేటి, రామకిట్టి, గోకారి, ప్రధాన కార్యదర్శి జి.మద్దిలేటి, సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, తిరుపతయ్య, శాలన్న, కోశాధికారి ఎస్‌.రాజు, సలహాదారు రమేష్‌, భీముడు, కృష్ణ, చిన్నయ్య, వెంకన్నలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌నాయకులు మద్దిలేటి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Publiture