పెండింగ్‌లో ఉన్న వరద బాధితుల ఇళ్ల పునర్నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ లకిëకాంతం అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో ఇళ్ల పురోగతిపై స్వచ్ఛంద సంస్థలు, హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వరదల్లో కూలిపోయిన ఇళ్ల స్థానంలో పునర్నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 6400 ఇళ్లు కూలి పోగా 4500 గృహాలను గ్రౌండింగ్ చేశామన్నారు. మిగతా ఇళ్ల గ్రౌండింగ్‌ను వచ్చే వారంలోపు పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఇళ్ల నిర్మాణంలో అవాంతరాలు ఏర్పడకుండా ప్రతి గ్రామానికి ఎఇతోపాటు వర్క్‌ఇన్‌స్పెక్టర్, ఎన్‌జిఓలను కేటాయిస్తానని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుకంగా వ్యవహరించి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. పునరావాస గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు ఆశించినస్థాయిలో లేవన్నారు. గుండ్రేవుల సంగాలలో పెండింగ్‌లో ఉన్న 479 గృహాలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని హౌసింగ్ డిఇకి సూచించారు. రెండ్రోజులకొకసారి ఇళ్లనిర్మాణాలపై సమీక్ష నిర్వహించాలని బెళగల్ తహశీల్దార్‌ను ఆదేశించారు. శాతనూరు, తుంబలూరు గ్రామాల్లో విద్యుత్, నీటి సమస్య ఉందని ఎన్‌జిఓ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని లకిëకాంతం హామీ ఇచ్చారు. స్వచ్ఛంద సంస్థలు గృహనిర్మాణాల్లో కాలయాపన చేస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇళ్లనిర్మాణంలోని సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ సూర్యప్రకాష్, హౌసింగ్ డిఎం రమేష్, ఆదోని ఆర్‌డిఓ ప్రభాకర్‌రెడ్డి, హౌసింగ్ ఇఇలు, ఎఇలు, డిఇలు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.