ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వ్యవసాయ కార్మికులకు అవగాహన కల్పించి చైతన్య పరచాలని కలెక్టర్ ముఖేష్‌కుమార్‌మీనా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 75వ వార్షికోత్సవ మహాసభల సందర్భంగా తయారు చేసిన సావనీర్‌ను కలెక్టర్ ముఖేష్‌కుమార్‌మీనా గురువారం తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలవుశేని, నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు రామకృష్ణలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడారు. వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకవెళ్తామని హామీ ఇచ్చారు. 75వ వార్షికోత్సవం సందర్భంగా ముద్రించిన ఈ సావనీర్‌ను ఏర్పాటు చేసిన వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం కింద వారికి పని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.