విత్తన కొరతతో రైతులకు ఇక్కట్లు

ప్రతియేటా ఖరీఫ్‌లో రైతన్నలను విత్తన కొరత వేధిస్తోంది. రైతులకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం అందించడంలో ఘోరంగా విఫలం చెందుతోంది. దీంతో రైతులు విత్తనాల కోసం ప్రయివేట్‌ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోతున్నారు.

ఎమ్మిగనూరు వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలో దాదాపు 50 వేల హెక్టార్లు సాగు భూమి ఉంది. ఇందులో దాదాపు 10 నుంచి 15 వేల హెక్టార్ల వరకూ ప్రతి ఏడాది రైతులు వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు. ఇందుకుగాను లక్షల క్వింటాళ్ల మేర రైతులకు అవసరం కాగా ప్రభుత్వం కేవలం వందల క్వింటాళ్లుమేర వేరుశనగ విత్తనాలను పంపిణీ చేస్తోంది. దీంతో రైతులు విత్తనాల కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఒక్క ఎమ్మిగనూరు సబ్‌ డివిజన్‌లోని ఎమ్మిగనూరు గోనెగండ్ల, నందవరం, మంత్రాలయం మండలాలకు అధికారులు 9,100 క్వింటాళ్లు వేరుశనగ విత్తనాలకు ప్రతిపాదనలు పంపగా 1475 క్వింటాళ్లు మాత్రమే మంజూరయ్యాయి.

రైతులు ఆశించిన స్థాయిలో విత్తనాలు అందకపోవడంతో రైతులు ఇతర పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోవు రోజుల్లో వేరుశనగ పంట కనుమరుగయ్యే పరిస్థితి రాకపోదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విత్తనాల కొరతను నివారించి సరిపడ వేరుశనగ విత్తనాలను అందించాలని రైతులు కోరుతున్నారు.

Sorry

java.lang.NullPointerException