ప్రజా సంక్షేమాన్ని మరచి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి టి షడ్రక్ అన్నారు. గురువారం సిపిఎం 6వ జోన్ కమిటీ ఆధ్వర్యంలో 39,40వ వార్డుల్లో ఇందిరాగాంధీ నగర్, గూడెం ప్రాంతాల్లో టి షడ్రక్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి నిర్మల సిపిఎం జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా టి షడ్రక్ మాట్లాడారు. ఎన్నికల ముందు 100 రోజులో ధరలు తగ్గిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నేరవేర్చపోగా మరోసారి ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రజలను అప్పుల పాలు చేసిందని ఆయన విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇందిరమ్మ, ఉపాధి హామీ పథకాలలో రూ.900 కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. ప్రాజెక్టుల పేరుతో రూ. 52 వేల కోట్లు కాంట్రాక్టులకు అప్పజెప్పి ఎకర పాలానికి కూడా నీరందించలేదన్నారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి నిర్మల మాట్లాడుతూ పావలా వడ్డీ రుణాలు, గ్యాస్ కనెక్షన్‌ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు మొండి చేయి చూపిందన్నారు. నగరంలోని పేద ప్రజలు 10 వేల మంది ఇళ్ల స్థలాల కోసం రూ. 2,100 డిడిలు రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు చూపలేదన్నారు. నగరంలో అధికార పార్టీ నాయకులు పెత్తనం కోసం పోటీ పడుతున్నారే తప్ప చెత్త సమస్యను పరిష్కరించడం లేదని విమర్శించారు. ఆగస్టు 10న విజయవాడలో జరిగే సిపిఎం కేంద్ర కమిటీ విస్తృత సమావేశాలకు కార్యకర్తలు కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి రాముడు, ఎస్ మాబాష, లాల్ అహమ్మద్ మజ్జీద్, వాసు, నాగరాజు, సుధాకర్‌రెడ్డి, రాజు, మాన్యం శ్రీను, ఖాదర్, లకిëదేవి, అరుణ, నౌమేశ్వరి, కిరణ్ మాషి తదితరులు పాల్గొన్నారు.
జమ్మిచెట్టు ప్రాంతంలో: కేంద్ర కమిటీ విస్తృత స్థాయి సమావేశాల సందర్భంగా జమ్మిచెట్టు ప్రాంతంలో 14వ వార్డు సిపిఎం శాఖ కార్యదర్శి టి మల్లి ఆధ్యక్షతన సిపిఎం నగర నాయకులు ఎస్‌ఎ సుభాన్ జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా 3వ జోన్ కార్యదర్శి ఎస్ శాలు బాష మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మునిస్వామి, శివప్రసాద్, మాబాష, రహిమాన్, శ్రీను, మహేష్, సంజన్న, మస్తాన్‌వలిలు పాల్గొన్నారు.
కల్లూరు కాలనీలలో: కల్లూరు కాలనీలోని 29, 30, 33, 36, వార్డులలో సిపిఎం జెండాలను జోన్ కార్యదర్శి సిహెచ్ సాయిబాబా, వార్డు బాధ్యులు సత్యం, కార్పొరేటర్ అలివేలమ్మలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గౌస్‌దేశారు, కల్లూరు జోన్ కార్యదర్శి సిహెచ్ సాయిబాబా, జిల్లా నాయకులు కె ప్రభాకర్‌రెడ్డిలు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ప్రవేటీకరణ, అధిక ధరలు, నిరుద్యోగ సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్‌శర్మ, లక్ష్మయ్య, సత్యం, ఎల్లప్ప, జయమ్మ, సుధాకరప్ప, సోమన్న, అయ్యస్వామి, భాస్కర్, విజరు, దానమ్మ, రుక్మిణి, ఓబులమ్మ, పద్మ, లత, జాని తదితరులు పాల్గొన్నారు.