అక్కిరెడ్డిగూడెంలో చోరీ

  • 13 కాసుల బంగారం, ఏడువేల నగదు చోరీ

ప్రజాశక్తి - ముసునూరు

మండలంలోని అక్కిరెడ్డిగూడెంలో గురువారం తెల్లవారుఝామున దొంగలు ఓ ఇంటిలో చొరబడి 13 కాసుల బంగారం, ఏడువేల నగదు దొంగిలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అక్కిరెడ్డిగూడెంకు చెందిన మాదాల నాగేశ్వరరావు ఇల్లు గ్రామం చివరలో ఉంది. గురువారం తెల్లవారుజామున రెండు గంటలకు కరెంట్‌ పోగా ముగ్గురు దొంగలు వచ్చి తలుపలు తట్టడంతో నాగేశ్వరరావు తలుపు తీశాడు. వెంటనే వాళ్లు ఇంటిలోకి ప్రవేశించి డబ్బులు, బంగారం ఇవ్వాలన్నారు. అందుకు నాగేశ్వరరావు తిరస్కరించడంతో చెక్కతో నాగేశ్వరరావు, అతని భార్య శేషమాంబల తలలపై కొట్టి గాయపర్చారు. తర్వాత బీరువా తీసి 13 కాసుల బంగారం, ఏడువేల రూపాయల నగదు దొచుకెళ్లారు. ఈ విషయంపై నాగేశ్వరరావు ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌పి రామకృష్ణయ్య, ఎఎస్పీ బి.రాజకుమారి, అడిషనల్‌ ఎస్‌పి ఎం. సత్యనారాయణ పరిశీలించారు. గాయపడిన నాగేశ్వరరావు, అతని భార్య శేషమాంబలను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైనా వైద్యం కోసం విజయవాడ తరలించారు. సంఘటనా స్థలానికి డాగ్‌ స్క్వాడ్‌తో పాటు క్లూస్‌ టీంను రప్పించారు. దొంగలు పట్టుకున్న చెక్క ఆధారంగా సమీప తోటలోనున్న జుజ్జువరపు నాగరాజు ఇంటికి కుక్క వెళ్లింది. దాంతో నాగరాజును విచారించగా గురువారం తెల్లవారుజామున తమ ఇంటికెవ్వరో వచ్చినట్లు శబ్ధం అయ్యిందనీ, భయంతో తాము ఇంటి నుండి బయటకు రాలేదన్నారు. ఈ సంరద్భంగా ఎస్‌పి రామకృష్ణయ్య మాట్లాడుతూ నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్