నేడు రాష్ట్ర మౌలిక వసతుల శాఖామంత్రి జిల్లా పర్యటన

ప్రజాశక్తి - మచిలీపట్నం

రాష్ట్ర మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు 15వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుండి స్పెయిస్‌ జెట్‌ విమానంలో బయలుదేరి 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. 8.30 నుండి 9.45 గంటల వరకూ జిల్లా కలెక్టర్‌, ఎయిర్‌ పోర్టు అధికారులతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధిని సమీక్షిస్తారు. 9.50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుండి కారులో బయలుదేరి 10.15 గంటలకు విజయవాడ ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. 10.30 గంటల నుండి 11.30 గంటల వరకూ మచిలీపట్నం పోర్టుకు అవసరమైన భూసేకరణపై కలెక్టర్‌, పోర్టు అధికారులతో సమీక్షిస్తారు. 11.30 గంటలకు విజయవాడ నుండి కారులో బయలుదేరి 12.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటారు. 12.30 నుండి 2.00 గంటల వరకూ పోర్టు అధికారులు, పోర్టు సూపరింటెండెంట్‌, ఇంజనీర్లు, బందరు ఆర్‌డిఓలతో కలిసి పోర్టు ప్రాంతాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుండి 4 గంటల వరకూ స్వల్ప విరామం అనంతరం 4 గంటలకు రోడ్డు మార్గాన పెడన వెళతారు. 4.20 నుండి 6 గంటల వరకూ పెడన మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. 6 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 7 గంటలకు విజయవాడ ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుని అక్కడే బసచేస్తారు. 16వ తేదీ ఉదయం 8.30 గంటలకు స్పెయిస్‌ జెట్‌ విమానంలో హైదరాబాద్‌ వెళతారు.

Sorry

java.lang.NullPointerException