ప్రజాశక్తి- తిరువూరు
తిరువూరు మండలం జి.కొత్తూరుకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి రూ.1.20 కోట్లు వసూలు చేసిన ఉదంతమిది. ఉద్యోగం ఇమ్మని అడిగితే అక్కడి నుంచి ఉడాయించిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. పరారై ఇంటి కొచ్చిన అతన్ని బాధిత కన్సటెన్సీలు శనివారం నిలదీశాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలావున్నాయి. జి.కొత్తూరుకు చెందిన వేమిరెడ్డి సుధాకరరెడ్డి హైదరాబాద్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డిగా ప్రయివేట్ జాబ్ చేస్తున్నాడు. అక్కడ నిరుద్యోగులకు ఇన్‌ఫోటెక్స్ కంపెనీలో జాబ్‌లు ఇప్పిస్తాని చెప్పి ఒక కార్యాలయాన్ని ప్రారంభించాడు. ఆరుగురు కన్సల్టెన్సీలను నియమించుకుని వాటి ద్వారా సుమారు 220 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు. రూ.1.20 కోట్లు వసూలు చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. ఆరునెలలైనా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు కన్సల్టెన్సీలను నిలదీస్తుండంతో కిరణ్‌కోసం గాలిస్తున్నారు. చివరకు అతడి అడ్రస్ తెలుసుకొని శనివారం కన్సల్టేటివ్ నాగార్జున సారధ్యంలో ఆరుగురు వచ్చి కిరణ్ కుమార్‌రెడ్డి నిలదీశారు. అతని తండ్రి టేకులపల్లి పిఎసిఎస్ సెక్రటరీ వెంకట్రామిరెడ్డి తదితరులతో మాట్లాడారు. తాను ఎవ్వరి వద్దా డబ్బులు తీసుకోలేదని చెప్పాడు. డబ్బులు తమకు ఇచ్చేంతవరకూ ఇక్కడ నుండి వెళ్లేది లేదని ఆందోళనకారులు తెగేసి చెప్పారు.