ప్రజాశక్తి-పమిడిముక్కల
కౌలుదారుల చట్టం ద్వారా కౌలు రైతులకు న్యాయం చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ అన్నారు. శనివారం పమిడిముక్కల మండలం సిపిఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు పంటపైన మాత్రమే రుణం వస్తుందని, భూమిపై ఎలాంటి హక్కూ ఉండదన్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అనుసరించి కౌలు రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు. తోట్లవల్లూరు మండలంలో ఐదు వేల మంది కౌలు దారులకు 91 దరఖాస్తులు మాత్రమే అందాయన్నారు. రైతులకు అధికారులు ఫోన్ చేసి కౌలు దారుకి కౌలు పుస్తకం ఇవ్వవచ్చా, లేదా అని అడగడం సమంజసం కాదని అన్నారు. దీనిపై కలెక్టర్‌కు నివేదిక పంపుతామన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులు 14 రోజుల లోపు ఇవ్వాలని, నిరంతరంగా కౌలు దారుల గుర్తింపు ప్రక్రియ జరగాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది 40 లక్షల కౌలు దారులుంటే ఆరు లక్షల కార్డులు మాత్రమే ఇచ్చారని ఉటంకించారు. రైతులకు న్యాయం జరిగేటట్లు తమ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పామర్రు డివిజన్ కార్యదర్శి చేబ్రోలు భాస్కరరావు, పమిడిముక్కల సిపియం కార్యదర్శి మహేశ్వరరావు, మండల వ్యవసాయ సంఘ అధ్యక్షులు రామాంజనేయ ప్రసాద్, శ్రీనివాసరావు, బొల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
java.lang.NullPointerException