గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం వల్ల ఆ విద్యార్థులే ఎక్కువ విజయాలు సాధిస్తారని జిల్లా కలెక్టర్ వి.ఉషారాణి అన్నారు. శనివారం రాత్రి మధిర కేంద్రంలోని గ్లోబల్ కాన్సెప్ట్ పాఠశాల సభలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా నడపడం సంతోషకరమని ఆప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులకో వరమని అన్నారు. ఆటపాటలతో విద్యనభ్యసిస్తూ ముందుకు సాగాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. ఇటీవల వరద బాధితుల కోసం గ్లోబల్ పాఠశాల విరాళాలను ఈసందర్బంగా గుర్తుచేస్తు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం పాఠశాల క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిప ిజూపూరిగోపాలరావు,జెడ్‌పిటిసి సారధి, మండల కో-అప్షన్ సభ్యులు ఎండి అహ్మద్ అలీ, ఎంపిడిఓ తిరుపతయ్య, గ్లోబల్ పాఠశాల డైరెక్టర్ ఖదీర్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
భద్రాచలం డివిజన్లో భారీ వర్షం
కూనవరంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం
భారీవర్షం...జలదిగ్బందలో 'గూడెం'
పలు చెరువులకు గండ్లు
పాల్వంచలో వరద భీభత్సం
వికలాంగులకు సదరమ్ పథకం : కలక్టర్
ఆగస్టు 15లోగాఅటవీహక్కు పత్రాలు పంపిణీ: కలెక్టర్
కిన్నెరసాని ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత
కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి :వ్యకాస