ఐటిసి ఎన్నికల్లో

  • 23 ఓట్లతో ఐఎన్‌టియుసి జయకేతనం

ఐటిసి పిఎస్‌పిడి కార్మిక సంఘ ఎన్నికల్లో ఐఎన్‌టియుసి విజయకేతనం ఎగరవేసింది. గత సంవత్సరం 30న జరిగిన ఐటిసి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టియుసి, టిఎన్‌టియుసి, కార్మిక జ్యోతి తదితర కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. అదేరోజు కౌంటింగ్‌ జరపాల్సి ఉండగా బదిలీ ఓట్ల లెక్కింపుపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో నిలుపుదల చేశారు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకుకౌంటింగ్‌ ప్రక్రియను స్థానిక యాజమాన్యం లేబర్‌ కమిషన్‌ సారధ్యంలో శనివారం జరిపింది. ఈ ఎన్నికల్లో ఐఎన్‌టియుసికి 745 రాగా టిఎన్‌టియుసికి 722 , కార్మిక జ్యోతికి 82 ఓట్లు నమోదయ్యాయి. దీంతో ఐఎన్‌టియుసి 23 ఓట్లతో జయకేతనం ఎగురవేసింది. మొత్తం 1552 ఓట్లలో మూడు ఓట్లు చెల్లకుండా పోయాయి.

సారపాకలో భారీ ర్యాలీ : ఎన్నికల్లో విజయం సాధించిన ఐఎన్‌టియుసి కర్మాగార కాలనీతోపాటు సారపాకలో భారీ ర్యాలీ నిర్వహించింది. భారీ ఊరేగింపు జరిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టియుసి అధ్యక్ష, కార్యదర్శులు దారుగా, మారం వెంకటేశ్వరరెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి వై.రోశిరెడ్డి, స్థానిక నాయకులు రమణారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్