ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల కోసం మధ్యాహ్నా భోజన పథకం ప్రవేశపెట్టింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఉపాధ్యాయులు విద్యార్థుల మిడ్డే మీల్స్‌ను మింగేస్తున్న వైనం చింతూరు మండలంలోని ఉన్నత పాఠశాలలో గురువారం విలేకర్ల కంట పడింది. విద్యార్థుల చేత ప్రతిరోజూ భోజనాన్ని తరగతి గదిలోకి తెప్పించుకొని ఉపాధ్యాయులందరూ సమిష్టిగా కూర్చొని ఆరగిస్తున్నారు. అంతేగాక మిడ్డే మీల్స్‌ను తయారు చేసే వారితో కుమ్మక్కై చికెన్, మటన్‌లు తెప్పించుకొని వారితో వడించుకోని తృప్తిగా భోం చేస్తున్నారు. గురువారం విలేకర్లు ఇదేమిటని ఉపాధ్యాయులను ప్రశ్నించగా కేవలంఉందో వంటలను రుచి చుస్తున్నామని తాండవించారు.ఇప్పటికైన అధికారులు స్పందించి విద్యార్థుల మధ్యాహ్నాం భోజనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు విలేకర్లను కోరారు.
భద్రాచలం డివిజన్లో భారీ వర్షం
కూనవరంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం
భారీవర్షం...జలదిగ్బందలో 'గూడెం'
పలు చెరువులకు గండ్లు
పాల్వంచలో వరద భీభత్సం
వికలాంగులకు సదరమ్ పథకం : కలక్టర్
ఆగస్టు 15లోగాఅటవీహక్కు పత్రాలు పంపిణీ: కలెక్టర్
కిన్నెరసాని ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత
కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి :వ్యకాస