కళారంగానికి ప్రజల ప్రోత్సాహమే పునాది అని, కళారంగం చిరకాలం నిలిచి వుండడానికి సమాజము, పరసంస్థల సహకారం ఎంతో అవసరమని నవరస కళాపరిషత్ అధ్యక్షులు గాదిరెడ్డి రాంబాబురెడ్డి అన్నారు. పట్టణంలో తెలుగు నాటక రంగ దినోత్సవ వేడుకలను లైబ్రేరియన్ జి.రామకృష్ణ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కళారంగాన్ని, కళాకారులను ప్రోత్సహించడం కోసం నవరస కళాపరిషత్‌ను స్థాపించినట్లు తెలిపారు. సమాజానికి సందేశంతోపాటు మానసిక వికాసానికి కళలు దోహద పడతాయని సోమరాజు శివరామ్‌ప్రసాద్ అన్నారు. అనంతరం పట్టణంలోని సీనియర్ కళాకారులు బూరుగు యోబు, శీలం కోటిరెడ్డిలను శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సన్మానిం చారు. కోటిరెడ్డికి ప్రతి నెల రూ.200లు సహాయా న్ని అందిస్తామని రాంబా బురెడ్డి పేర్కొన్నారు. మొదటి నెల ఆర్థిక సహాయా న్ని అందజేశారు.
నవరస కళాపరిషత్ కమిటీ ఏర్పాటు :
అధ్యక్షులుగా గాదిరెడ్డి రాంబాబురెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బి.మధుసూదనరాజు, ఉపాధ్యక్షులుగా బి.జ్ఞానసాగర్, వి.సరోజిని, సంయుక్త కార్యదర్శులుగా జి.కిషోర్‌రెడ్డి, ఆడమ్స్, జి.రామకృష్ణ, కోశాధికారిగా తోట గణేష్‌బాబు, ప్రచార కార్యదర్శిగా పి.నాగేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. త్వరలో పూర్తిస్థాయి కమిటీని ప్రకటిస్తామని రాంబాబురెడ్డి తెలిపారు.
తగ్గుముఖం పట్టిన రిజిస్ట్రేషన్లు
సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత
వర్గపోరాటాలకు అస్థిత్వ రాజకీయాలు విగాతం
అధికారుల నిర్వాకంతో కూలీలకు నష్టం
తునికాకు బోనస్‌ను వెంటనే చెల్లించాలి
నాటి తెలంగాణా హద్దుల కోసం పుట్టలేద
అమ్మహస్తం కుంభకోణం
సెలవులో సిద్ధార్థజైన్
సారాను నిర్మూలించండి స్థావరాలపై సంయుక్తంగా దాడులు 'గ్రీవెన్స్‌డే'లో సిద్ధార్థజైన్